Yuvraj Singh

Yuvraj Singh: గుజరాత్ టీమ్ తో చేరిన యువరాజ్.. కారణమిదే..?

Yuvraj Singh: ఐపీఎల్ ఈ సీజన్ లో గుజరాత్ అదరగొడుతుంది. మహామహా జట్లనే చిత్తు చేసి ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. అయితే లీగ్ మ్యాచులు చివర దశకు వచ్చేసరికి ఆ జట్టుకు వరుస ఓటముల బాట పట్టింది. తన చివరి రెండు మ్యాచులలోనూ ఓడిపోయింది. ప్లే ఆఫ్స్ లోనూ అదే పరిస్థితి కొనసాగితే టైటిల్ గెలవాలన్న ఆశలు ఆవిరవుతాయి. ఈ క్రమంలో ఆ టీమ్ మేనేజ్ మెంట్ ఎంతో అనుభవమున్న విధ్వంసకర బ్యాటర్ ను రంగంలోకి దించింది. అతడెవరో కాదు యువరాజ్ సింగ్.

గుజరాత్ టైటాన్స్ తన ఇన్‌స్టాలో యువరాజ్ సింగ్, శుభ్‌మాన్ గిల్ ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ఈ రెండు పరాజయాల తర్వాత జట్టు యాజమాన్యానికి తలనొప్పి మొదలైంది. అందుకే, ప్లేఆఫ్‌లకు ముందే జట్టులోని అన్ని బలహీనతలపై ఫోకస్ పెట్టిన మేనేజ్‌మెంట్, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని యువరాజ్ సింగ్‌ను ఆహ్వానించింది.

Also Read: RCB IPL 2025: ఐపీఎల్ చరిత్రలోనే ఆర్పీబీ అరుదైన రికార్డు

Yuvraj Singh: ఐపీఎల్‌లో పలు జట్లకు యువరాజ్ ప్రాతినిథ్యం వహించాడు. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. ఈ జట్ల బలాలు, బలహీనతలు అతడికి తెలుసు. అందువల్ల ప్లే-ఆఫ్ మ్యాచ్‌లలో యువరాజ్ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని గుజరాత్ యోచిస్తోంది. అందుకే టీమ్ మేనేజ్ మెంట్ యువరాజ్ సింగ్‌ను మెంటర్ గా తీసుకొచ్చింది. కోచ్ నెహ్రా వ్యూహాల్లో భాగంగానే యువరాజ్ గుజరాత్ టీమ్ లో చేరినట్లు తెలుస్తోంది. యువరాజ్ రాకతో గుజరాత్ కప్ కొడుతుందా అన్నది చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Jasprit Bumrah: బుమ్రానే టార్గెట్.. భారత్‌పై ఆస్ట్రేలియా 'స్మార్ట్' ప్లాన్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *