Mad Square: లేటెస్ట్ టాలీవుడ్ ఎంటర్టైనర్ “మ్యాడ్ స్క్వేర్” బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తుంది. ఈ చిత్రాన్ని యంగ్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించారు. ఈ సినిమాలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ నటించారు. పార్ట్ 1 భారీ విజయం సాధించగా, దానికి కొనసాగింపుగా పార్ట్ 2 ఈ ఉగాది సందర్భంగా రిలీజైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద గట్టి వసూళ్లు రాబడుతోంది. నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో 3.53 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా, మొత్తంగా నాలుగు రోజుల్లో 18.44 కోట్ల షేర్‌తో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఫుల్ రన్‌లో ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. ప్రస్తుతం ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా దూసుకెళ్తోంది.

