Jr NTR

Jr NTR: ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఆ పుస్తకం ఏంటీ? వైరల్ గా మారిన వీడియో!

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. RRR వంటి పెద్ద హిట్ తర్వాత దేవర సినిమా చేసాడు. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) అనే పెద్ద ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్ . పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ చిత్రం అంచనాలను పెంచేసింది. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. దీనితో పాటు, బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ నటించిన ప్రతిష్టాత్మక యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘వార్ 2’ చిత్రం ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఇటీవల ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్ పట్టుకున్న ఒక పుస్తకం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు, సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించిన పుస్తకం ఆనంద్ బాలసుబ్రహ్మణ్యం రాసిన “మురుగ: ది లార్డ్ ఆఫ్ వార్, ది గాడ్ ఆఫ్ విజ్డమ్”. ఆనంద్ బాలసుబ్రమణియన్ రచించిన ఈ పుస్తకంలో కార్తికేయుడి కథను వివరించారు.

Also Read: Dhanush: వంద కోట్ల వీరుడు.. ధనుష్ సంచలన హ్యాట్రిక్!

Jr NTR: దర్శకుడు త్రివిక్రమ్ తో చేయనున్న ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ సన్నద్ధమవుతున్నారని అందుకే దీనిని చదువుతున్నారని పలువురు భావిస్తున్నారు. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమాపై అంచనాలు పెంచుతూ ఇటీవల నిర్మాత నాగవంశీ ఆసక్తికర పోస్టులు పెట్టారు. కార్తికేయుడి పద్యాన్ని ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Top Star: మీ హీరో, మీ ఓటు.. మన టాప్ స్టార్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *