Vaikuntha Ekadashi: దేవతలకు ఉత్తరాయణం పగలు, దక్షిణాయణం రాత్రి వేళగా చెబుతారు. ఈ మధ్యలో వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రహ్మీ సమయంగా పేర్కొంటారు. ఈ ముహూర్తంలో వచ్చే శుక్ల ఏకాదశి అత్యంత పవిత్రమైనది. దీనినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 30న వచ్చింది. ఆ రోజు మహా విష్ణువు మూడు కోట్ల దేవతలతో దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని, ఉత్తరద్వారం నుంచి దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం.
వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం తెల్లవారుజామునే చేసుకోవడం శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. ఏకాదశి తిథి రేపు ఉదయం 7:51కి మొదలై, ఎల్లుండి పొద్దున5:01 వరకు ఉంటుంది. శాస్త్రరీత్యా డిసెంబర్ 30నే వైకుంఠ ఏకాదశిగా పరిగణిస్తారు. అందువల్ల ఈ శుభ దినాన ఏ సమయంలో శ్రీనివాసుడిని దర్శించుకున్నా.. అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. భక్తితో చేసే ఈ దర్శనం అజ్ఞానాన్ని తొలగించి, మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తుంది. కాగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఇవాళ అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి.
ఇది కూడా చదవండి: TG Assembly: ఆరోగ్యం ఎలా ఉంది? కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించిన రేవంత్
అర్ధరాత్రి 12.05 గంటలకు తిరుప్పావై పాశురాలతో ఆలయంలోని బంగారు వాకిలి తలుపులు తెరవనున్నారు. తొలుత 1.30AMకు VIP బ్రేక్ దర్శనాలను ప్రారంభిస్తారు. తెల్లవారుజామున 5.30కు ఈ-డిప్లో టోకెన్లు పొందిన వారిని అనుమతిస్తారు. జనవరి 8వ తేదీ వరకు సుమారు 7.7 లక్షల మందికి దర్శనం కల్పించేలా TTD ఏర్పాట్లు చేసింది.
