AP New Districts

AP New Districts: ఏపీలో తెరపైకి కొత్త జిల్లాలు..చంద్రబాబు సర్కార్ ఏం చేయబోతుంది?

AP New Districts: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. 2022లో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించినప్పటికీ, ఈ విభజనపై ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి అనేక అభ్యంతరాలు, విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో, కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లాల పునర్విభజనపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

జిల్లాల పేర్లు, డివిజన్లు, మండలాలు, గ్రామాల సరిహద్దుల మార్పులపై ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ ఉపసంఘంలో ఏడుగురు మంత్రులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పులు చేర్పులకు సంబంధించి అధ్యయనం చేసి, ప్రజాభిప్రాయాలను, ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకుని నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.

ఇది కూడా చదవండి: Vice President: ఉప రాష్ట్రపతి రేసులో నీతీశ్, శశిథరూర్‌.. ఎవరికీ ఛాన్స్ ?

ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. గత ప్రభుత్వం పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలను పునర్విభజన చేసింది. అయితే, ఈ విభజన వల్ల కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు జిల్లా కేంద్రాలు దూరమవడం, పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ప్రధానంగా వినిపిస్తున్న కొన్ని డిమాండ్లు, సమస్యలున్నాయి.

• మార్కాపురం, హిందూపురం జిల్లాల ఏర్పాటు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని బలమైన డిమాండ్లు ఉన్నాయి.

• అన్నమయ్య జిల్లా – రాజంపేట/రాయచోటి: అన్నమయ్య జిల్లాకు రాయచోటి కాకుండా రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని కొన్ని ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తుండగా, మరికొందరు రాయచోటినే కొనసాగించాలని కోరుతున్నారు.

• ఏలూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు: ప్రస్తుతం ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలను తిరిగి కృష్ణా జిల్లాలోనే ఉంచాలని డిమాండ్లు ఉన్నాయి.

• అల్లూరి సీతారామరాజు జిల్లా – వై.రామవరం: ఈ జిల్లాలోని వై.రామవరం మండలాన్ని విభజించి కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలోనే హామీలు ఉన్నప్పటికీ, అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది.

• అనకాపల్లి జిల్లా రద్దుపై వదంతులు: సోషల్ మీడియాలో అనకాపల్లి జిల్లా రద్దు చేయబోతున్నారని వదంతులు వచ్చాయి, అయితే దీనిపై ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ టీమ్ అది అవాస్తవం అని స్పష్టం చేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *