Chia Seeds Water: చియా సీడ్స్ చూడటానికి చిన్నగా ఉంటాయి. కానీ వాటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందులో ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ముఖ్యమైన మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. చియా విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ, గుండె ఆరోగ్యం, ఎముకల బలం, కండరాల పునరుద్ధరణకు సహాయపడుతుంది. కానీ వీటిని ఎక్కువగా ఉదయంపూట పరిగడుపున తాగుతారు. అయితే వీటిని ఉదయం కాకుండా రాత్రిపూట తింటే ఏమి జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? పడుకునే ముందు చియా విత్తనాలను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం..
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
చియా గింజలు ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి. మన పేగు ఆరోగ్యానికి చాలా మంచివి. రాత్రిపూట వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. వాటిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పోషిస్తుంది. జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బసం తగ్గుతుంది. రాత్రి బాగా నిద్రపడుతుంది.
ఆకలిని తగ్గిస్తుంది
చియా విత్తనాలలోని జెల్, ఫైబర్ కంటెంట్ కడుపు నిండిన అనుభూతిని అందిస్తుంది. ఇది రాత్రిపూట ఆలస్యంగా చిరుతిండి తినడం లేదా పడుకునే ముందు అతిగా తినడం వంటి అలవాటును నివారిస్తుంది. చియా విత్తనాలలో నెమ్మదిగా జీర్ణమయ్యే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుంది. తరచుగా కలిగే ఆకలి బాధలను అరికట్టడంలో సహాయపడుతుంది.
డీహైడ్రేషన్ సమస్యలకు చెక్
నానబెట్టిన చియా విత్తనాలు నీటిని 10-12 రెట్లు గ్రహిస్తాయి. తద్వారా శరీరంలో డిహైడ్రేషన్ సమస్యను నివారిస్తుంది. ఇది రాత్రంతా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అదనంగా చియా విత్తనాలు మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి. ఇది రాత్రిపూట వచ్చే తిమ్మిర్లు, నొప్పిని తగ్గిస్తుంది.
Also Read: Pregnancy Care: గర్భిణీ స్త్రీలు పైనాపిల్ తింటే గర్భస్రావం అవుతుందా?
కండరాల పునరుద్ధరణ
ఈ విత్తనాలలో ఒమేగా-3లు, కాల్షియం, మెగ్నీషియం,ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. రాత్రిపూట వీటిని తీసుకోవడం వల్ల శరీరం విశ్రాంతి తీసుకునేటప్పుడు కండరాలు కోలుకోవడం, పోషకాల గ్రహించడం వంటివి జరుగుతుంది. ఇది కండరాల నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
చియా విత్తనాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఈ రెండు అంశాలు నిద్రకు కూడా అవసరం. కాబట్టి మీరు నిద్రలేమితో బాధపడుతుంటే, పడుకునే ముందు చియా విత్తనాలలో నానబెట్టిన ఒక గ్లాసు నీరు త్రాగాలి. ఇది శరీరానికి విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా మీకు బాగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది.
చియా విత్తనాలు శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి కాబట్టి..ఇది రాత్రంతా రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడానికి, ఉదయం శక్తి క్రాష్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. భోజనం తర్వాత రక్తంలో చక్కెరలో ఆకస్మిక హెచ్చు తగ్గులను నివారించడానికి సహాయపడుతుంది. అలాగే చియా విత్తనాలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, మెగ్నీషియం ఉంటాయి. ఇవన్నీ ఇన్సులిన్ సున్నితత్వాన్ని, మొత్తం జీవక్రియ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.