H-1B Visa: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ H1B వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచడంతో భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుంది. అమెరికాలో భారతీయులకు భారీగా ఉద్యోగాలు తగ్గిపోతాయి. అక్కడ MS చదివేందుకు వెళ్లేవారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గనుంది. ఇప్పటికే MS పూర్తి చేసిన వారు లక్ష డాలర్ల విలువైన ప్రొడక్టివిటీ అందించగలిగితేనే కంపెనీలు వారిని స్పాన్సర్ చేస్తాయి. దీనివల్ల ఎవరిని పడితే వారిని నియమించుకునేందుకు వీలుండదు.
అమెరికా ప్రభుత్వం టెక్ కంపెనీల కోసం H1B వీసాలను జారీ చేస్తుంది. విదేశాలకు చెందిన ఐటీ, ఇంజినీరింగ్, ఫైనాన్స్, ఆరోగ్య నిపుణులను అమెరికా తీసుకెళ్లేందుకు పలు కంపెనీలు H1Bని ఉపయోగిస్తాయి. ఈ వీసాలు మూడేళ్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఆ తర్వాత రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది 85వేల H1B వీసాలు జారీ చేస్తాయి. వీటి ద్వారా ఎక్కువగా భారతీయులే లబ్ధి పొందుతున్నారు.
ఇది కూడా చదవండి: H-1B Visa: H-1B వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం.. రూ.లక్ష డాలర్లు కట్టాల్సిందే
భారత ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, TCS, విప్రో, HCL లాంటి సంస్థలు USలో పని చేస్తూ భారతీయులను రిక్రూట్ చేసుకుంటాయి. H1B వీసా అప్లికేషన్ ఫీజు పెంపుతో వాటిపై తీవ్ర ప్రభావం పడనుంది. ఒక్కో ఉద్యోగిపై లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల కంపెనీల లాభాలు తగ్గిపోతాయి. ఫలితంగా ఆ సంస్థలు ఇండియా లేదా ఇతర దేశాలకు తరలివెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో భారతీయులు అమెరికా వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చు.