winter depression: చలికాలంలో చాలా మంది ఉదయం, రాత్రి వేళ్లల్లో ఇంటి నుంచి బయటకు రావాలంటే జంకుతారు. కొంతమంది చలిని ఆస్వాదిస్తున్నప్పటికీ దగ్గు, జ్వరం, జలుబుతో పాటు అనేక అనారోగ్య సమస్యల బారిన పడతారు. ఈ సీజన్లో నిద్రతో పాటు మానసిక సమస్యలు కూడా వేధిస్తాయి. చాలా మంది సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్‌తో బాధపడతారు. దీనినే వింటర్ డిప్రెషన్ అని అంటారు. వింటర్ డిప్రెషన్ లక్షణాలేంటీ..? దీన్ని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వింటర్ డిప్రెషన్ లక్షణాలు :
winter depression: ఇది ఒక రకమైన మానసిక ఆరోగ్య సమస్య. ఇది ప్రధానంగా చలికాలంలో కనిపిస్తుంది. దీన్ని వల్ల వ్యక్తిలో చికాకు, సోమరితనం, ఒత్తిడి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది చలికాలం ప్రారంభం నుండి చివరి వరకు ఉంటుంది. ఈ డిప్రెషన్ ఎవరికైనా రావచ్చు.
ఇది కూడా చదవండి: Jayasudha: ఏది చేసినా జయసుధకు సహజమే
వింటర్ డిప్రెషన్‌కు కారణాలు :
winter depression: చలికాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జీవనశైలి కూడా తగ్గుతుంది. ఇది కొందరిలో వింటర్ డిప్రెషన్‌కు కారణమవుతుంది. నిద్రకు సంబంధించిన హార్మోన్ మెలటోనిన్ కూడా చలికాలపు డిప్రెషన్‌ను పెంచుతుంది. పగటిపూట తగినంత కాంతి లేనందున శరీరం ఎక్కువ మెలటోనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది డిప్రెషన్ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. విచారం, ఒత్తిడి, శక్తి లేకపోవడం, అధిక నిద్ర, బరువు పెరగడం వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి.
వింటర్ డిప్రెషన్‌ను నివారణ:
winter depression: వింటర్ డిప్రెషన్‌ను నివారించడంలో విటమిన్ D కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలో సెరోటోనిన్ స్థాయిని పెంచుతుంది. సెరోటోనిన్ మానసిక స్థితిని సమతుల్యం చేసే సంతోషకరమైన హార్మోన్. ఇది శరీరానికి సూర్యకాంతి వల్ల ఎక్కువగా లభిస్తుంది. చలికాలంలో సూర్యకాంతి తక్కువగా ఉన్నప్పుడు బాడీ యొక్క సర్కాడియన్ రిథమ్ మారుతుంది. ఇది అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి చలికాలంలో శరీరానికి సూర్యరశ్మి చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజూ 15 నుండి 30 నిమిషాల పాటు ఎండలో కూర్చుంటే ఎన్నో లాభాలుంటాయి. బయటకు వెళ్లడం సాధ్యం కాకపోతే విటమిన్ D సప్లిమెంట్లను తీసుకోవడం బెటర్.
ఇది కూడా చదవండి: Hydra Commissioner: కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
ఇలా చేయాలి
winter depression: ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది. మీరు డిప్రెషన్‌తో బాధపడుతుంటే ప్రతిరోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయండి. ఒంటరిగా ఉండకుండా.. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. నిద్ర లేకపోవడంకూడా మీ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి రోజూ 7-8 గంటలు నిద్రపోవడం మర్చిపోవద్దు.