Crime News

Crime News: అమ్మా, నేను దొంగతనం చేయలేదు.. 13 ఏళ్ల బాలుడి చివరి మాటలు

Crime News: పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లా ఓ విషాదకర సంఘటనకు వేదికైంది. ఓ చిన్న చిప్స్ ప్యాకెట్ తప్పుడు ఆరోపణగా మారి, ఓ బాలుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ‘నేను దొంగతనం చేయలేదు’ అని ఏడ్చిన ఆ వాడి కన్నీళ్లు ఇక ఎవరికి వినిపించవు. ఈ సంఘటన భారత దేశంలో చిన్నారులపై పెరుగుతున్న సామాజిక ఒత్తిడి, అవమానం, మరియు దుర్వినియోగంపై ఆవేదన కలిగించే ప్రశ్నలు లేవనెత్తుతుంది.

Crime News: 13 ఏళ్ల కృష్ణేందు, బకుల్డా హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న చిన్నారి. ఆ చిన్నాడు చిప్స్ కొనేందుకు బయటకు వెళ్లాడు. అదే అతని జీవితంలో చివరి ప్రయాణంగా మారుతుంది అని ఎవరు ఊహించగలిగారు? గోన్సైబర్ బజార్‌లో శుభాంకర్ దీక్షిత్ అనే దుకాణదారుడు — వృత్తిరీత్యా పౌర స్వచ్ఛంద సేవకుడు — కృష్ణేందుపై మూడు చిప్స్ ప్యాకెట్లు దొంగిలించాడని ఆరోపించాడు.

Crime News: దుకాణదారుడు అతన్ని బలవంతంగా తన దుకాణానికి తీసుకెళ్లి, చెవులు పట్టుకుని సిట్-అప్‌లు చేయించాడు. మానసిక వేధింపులతో పాటు శారీరక దాడికి కూడా పాల్పడ్డాడు. స్థానికుల ముందు బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ ఆజ్ఞాపించాడు. ఇది చిన్న మనసున్న ఓ బాలుడికి తట్టుకోలేని అవమానంగా మారింది.

“అమ్మా, నేను దొంగతనం చేయలేదు” – ఆఖరి మాటలు

Crime News: ఇంటికి వచ్చిన కృష్ణేందు, తీవ్ర మనస్తాపంతో పురుగుమందు తాగాడు. తల్లి తండ్రులు తమలుక్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లినా అప్పటికే ఆలస్యం అయింది. చికిత్స పొందుతూ బాలుడు గురువారం ఉదయం మరణించాడు. అతని గదిలో ఒక చిన్న లేఖ కనిపించింది — ఆ లేఖలో వ్రాసిన ప్రతి పదం తల్లి గుండెను ఛిద్రించాయి:

Crime News: అమ్మా, నేను రోడ్డు పక్కన పడిపోయిన చిప్స్ ప్యాకెట్ తీసుకున్నాను. దానిని దొంగిలించలేదు. నాకు నమ్మకం ఉంది, నువ్వు నన్ను నమ్ముతావు. ఈ చిన్న లేఖలో లేని లక్ష భావాలూ మిగిలిపోయాయి.

Crime News: స్థానికులు, కుటుంబ సభ్యులు, బాధితుడి మిత్రులు అందరూ ఒకే స్వరంతో దోషికి కఠిన శిక్ష వేటవేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ శుభాంకర్ దీక్షిత్ మాత్రం ఇప్పటికీ స్పందించలేదు. సిసిటివి ఫుటేజ్ కూడా బయటపెట్టేందుకు నిరాకరించాడని సమాచారం. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినప్పటికీ, కుటుంబం నుంచి అధికారిక ఫిర్యాదు మాత్రం రాలేదు.

Crime News: ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నారులు దొంగతనం చేశారంటూ తప్పుడు ఆరోపణలు చేసి, వారిని బహిరంగంగా హింసించడం, అవమానించడం మన సమాజానికి తగదు. వారు చేసిన తప్పులు ఉంటే న్యాయబద్ధంగా తేల్చాలి. కానీ నిందలు, అవమానాలు, శారీరక దాడులతో వారి మనసులను చంపడం అసహనీయమైన చర్య.

Crime News: కృష్ణేందు ఈ లోకాన్ని విడిచిపోయాడు. కానీ అతని చివరి మాటలు — “అమ్మా, నేను దొంగతనం చేయలేదు” — మన ప్రతి ఒక్కరిలోని మానవత్వాన్ని, బాధ్యతను మేల్కొలిపేలా ఉన్నాయి. ఓ చిన్ని చిప్స్ ప్యాకెట్ ఎందుకీ హింస..? ఎందుకీ ప్రాణనష్టం..? మనం సమాజంగా ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అప్పుడే కృష్ణేందుకు నిజమైన న్యాయం జరుగుతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *