Weekly Horoscope: ఆగస్టు 10 నుంచి 16 వరకు ఉండే ఈ వారం 12 రాశుల వారికి ఏయే అవకాశాలు, సవాళ్లు ఎదురు కాబోతున్నాయో చూద్దాం. గ్రహాల స్థానాల ఆధారంగా ఈ వారం మీకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ వారం కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంది.
మేష రాశి: ఈ వారం మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. ఆదాయం బాగా పెరుగుతుంది. ఇంట్లోనూ, బయట కూడా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ, మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూలమైన సమయం ఇది. ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి చేతికి వస్తుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం.
వృషభ రాశి: ఈ రాశి వారికి ఈ వారం ఖర్చుల కంటే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తి, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల కోసం ఖర్చు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్తగా వాహనం కొనే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉన్నా, ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.
మిథున రాశి: ఈ వారం చాలా సంతోషంగా గడిచిపోతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా విజయం సాధిస్తారు. అయితే, కుటుంబంలో కొన్ని చిన్న సమస్యలు తలెత్తవచ్చు. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇది మంచి సమయం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల్లో ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కర్కాటక రాశి: ఈ వారం మీరు చేపట్టే ఏ ప్రయత్నమైనా విజయవంతమవుతుంది. ముఖ్యంగా, ఆదాయానికి సంబంధించిన ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. బంధువుల వల్ల ఆర్థికంగా కొంత నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నా, సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
సింహ రాశి: ఈ వారం మీ ఆదాయం చాలా పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి, జీతాల పెంపునకు అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించి ఉంటాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అయితే, స్నేహితుల వల్ల సమస్యలు రావచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి మంచి వార్తలు వింటారు.
కన్య రాశి: ఈ వారం ఉద్యోగులకు, నిరుద్యోగులకు కొన్ని శుభ పరిణామాలు జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి, జీతం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
తుల రాశి: ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో మీ ప్రాధాన్యం పెరుగుతుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభం ఉండవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చిక రాశి: ఈ వారం ఆదాయం ఆశించిన స్థాయిలో ఉంటుంది. ఆరోగ్య, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. అయితే, ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తొందరపడకుండా ఉండాలి.
ధనుస్సు రాశి: ఉద్యోగంలో పదోన్నతులు, జీతాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. తండ్రి తరపు వారితో ఆస్తి వివాదాలు కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు. కుటుంబంలో సామరస్య వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం పర్వాలేదు. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.
మకర రాశి: ఈ వారం ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆదాయం పెరగడంతో పాటు, ఆగిపోయిన డబ్బు కూడా చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి స్నేహితుల సహాయం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా సాగుతాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఇది కలిసి వచ్చే కాలం. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభ రాశి: ఈ వారం మీ కోరికలు నెరవేరుతాయి. ఆదాయ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే, ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ దగ్గర సహాయం పొందిన వారు మీకు దూరం కావచ్చు. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లలు బాగా రాణిస్తారు.
మీన రాశి: ఈ వారం మీ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఉద్యోగంలో మీ ప్రాధాన్యం పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. పిల్లలు బాగా అభివృద్ధి చెందుతారు. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా ధన లాభం ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.