Weekly Horoscope

Weekly Horoscope: మీ రాశి ప్రకారం ఈ వారం ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ పరిస్థితి ఎలా ఉందంటే…?

Weekly Horoscope: ఈ వారం ఆగస్టు 17 నుంచి 23 వరకు వివిధ రాశుల వారికి జ్యోతిష్య ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వారం గ్రహాల స్థానాలు, వాటి ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు వస్తే, మరికొందరికి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఈ వారం మేష రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది, పిల్లల ఎదుగుదల సంతోషాన్నిస్తుంది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ధనలాభం ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త ఆలోచనలతో లాభాలు పొందుతారు. అయితే, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అవసరం. ఆర్థిక పరమైన వాగ్దానాలు చేయకుండా ఉండటం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృషభ రాశి వారికి ఈ వారం ఎక్కువగా శుభవార్తలే వింటారు. నిరుద్యోగులకు సొంత ఊరిలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభాలు తెస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు కలిసి వస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు ఉంటాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
మిథున రాశి వారికి ఈ వారం అంతా విజయాలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. చిన్నపాటి ఒత్తిడులు ఉన్నప్పటికీ, మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఈ వారం కర్కాటక రాశి వారికి ఆర్థికంగా లోటు ఉండదు. ఆదాయం బాగుంటుంది. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో మీ హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారాలు స్థిరంగా సాగుతాయి. కుటుంబ సభ్యులపై ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు మేలు చేస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
సింహ రాశి వారికి ఈ వారం కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు సకాలంలో అందక ఇబ్బందులు పడవచ్చు. ఉద్యోగ, వ్యాపారాలపై మరింత శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు నిరాశ కలిగించవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
కన్య రాశి వారికి ఈ వారం అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. శుభవార్తలు వింటారు. ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయానికి చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. పాత ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
తులా రాశి వారికి ఈ వారం పదోన్నతులు, జీతాల పెరుగుదల ఉండే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అనుకున్న పనులు వేగంగా పూర్తవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బందులు పడవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. అదనపు ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. నిరుద్యోగులకు సొంత ఊరిలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1)
ఈ వారం ధనుస్సు రాశి వారికి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వివాదాల్లో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు తమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
మకర రాశి వారికి ఈ వారం ఏ ప్రయత్నం చేసినా సఫలం అవుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు స్థిరంగా సాగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
కుంభ రాశి వారికి ఈ వారం కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. శ్రమ, తిప్పట ఎక్కువగా ఉండవచ్చు. ఆదాయం, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఉద్యోగంలో పని భారం పెరిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, రాజకీయాలు వంటి వ్యాపారాల్లో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
మీన రాశి వారికి ఈ వారం సంతృప్తికరంగా గడిచిపోతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో అధికారులకు మీపై నమ్మకం పెరుగుతుంది, కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *