Weather Update:ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపారుతున్నాయి. పలుచోట్ల వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేని వర్షాలతో అవస్థలు పడుతున్నారు. ఆగస్టు 7, 8 తేదీల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆగస్టు 9వ తేదీన కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
Weather Update:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి, చిత్తూరు, మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం తదితర జిల్లాల్లో శనివారం (ఆగస్టు 9న) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ తెలిపింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, జనగాం, వరంగల్, హనుమకొండ, నల్లగొండ, సూర్యాపేట, వనపర్తి, గద్వాల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
Weather Update:రెండు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదవుతాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రెండు ప్రభుత్వాల ఉన్నతాధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. సెల్లార్ల కింద ఉండే కుటుంబాలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.