Weather: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల సూచనతో 14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ (ఆకస్మిక వరద) అలర్ట్ జారీ అయ్యింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ అలర్ట్ ప్రకారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు ప్రమాదావస్థలో ఉన్న జిల్లాలుగా గుర్తించారు.
తక్కువ సమయంలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
“ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. నదులు, వాగులు, చెరువుల దగ్గరకి వెళ్లకూడదు. అవసరం లేని ప్రయాణాలు మానుకోవాలి” అని విపత్తు నిర్వహణ విభాగం సూచించింది.