Hyderabad: బోరబండ నుంచి లింగంపల్లి వరకు ఉన్న 800 డయా ఎంఎస్ పైపులైన్‌కు సఫ్దార్ నగర్ వద్ద లీకేజీ ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు డిసెంబర్ 22 (ఆదివారం) ఉదయం 6 గంటల నుంచి డిసెంబర్ 23 (సోమవారం) వరకు మరమ్మతు పనులు చేపడుతున్నట్లు జల మండలి అధికారులు తెలిపారు.
ఈ 24 గంటల వ్యవధిలో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేయబడుతుంది. నీటి సరఫరాలో అంతరాయం కలిగే ప్రాంతాలు:
ఎస్పీఆర్ హిల్స్ సెక్షన్: జైవంత్ నగర్, సునీల్ నగర్, వికర్స్ సెక్షన్: మహాత్మా నగర్, వినాయక్ నగర్,బీబ్ ఫాతిమా నగర్: ఫేజ్-1, ఫేజ్-2,ఇంద్రనగర్, టి.అంజయ్య నగర్, బాబా సైలానీ నగర్,భరత్ నగర్, గాయత్రి నగర్, అల్లాపూర్, అజీజ్ నగర్,శివ బస్తీ, మిరాజ్ నగర్, పద్మావతి నగర్,తులసి నగర్, వివేకానంద నగర్, పర్వత్ నగర్,రామారావు నగర్, హరి నగర్, శివాజీ నగర్,ఆర్కే సోసైటీ, రాధాకృష్ణ నగర్, కేఎస్ నగర్,రాణా ప్రతాప్ నగర్, గణేశ్ నగర్ తదితర ప్రాంతాలు
ఈ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని, వినియోగదారులు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని, అధికారులకు సహకరించాలంటూ జలమండలి విజ్ఞప్తి చేసింది.