WTC Final 2025: 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికా చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్ల ప్రదర్శన అంతగా లేదు. దీని కారణంగా దక్షిణాఫ్రికా 282 పరుగుల లక్ష్యాన్ని సులభంగా చేధించింది. ఇదిలా ఉండగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కంటే ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇస్తున్నందుకు తన దేశస్థుడు జోష్ హేజిల్‌వుడ్‌ను ఆస్ట్రేలియా మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ విమర్శించారు.
WTC ఫైనల్లో హేజిల్‌వుడ్ రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. హేజిల్‌వుడ్ ప్రదర్శన చూసిన తర్వాత, మిచెల్ జాన్సన్ అతనిపై విమర్శలు కురిపించాడు. WTC ఫైనల్‌కు ముందు ఐపీఎల్ ఆడాలనే హేజిల్ వుడ్ నిర్ణయం కరెక్ట్ కాదని అన్నాడు. ఐపీఎల్ ఆడటానికి బదులుగా హాజిల్‌వుడ్ WTC ఫైనల్‌కు సిద్ధమై ఉంటే.. జట్టుకు చాలా మెరుగ్గా ఉండేదని జాన్సన్ అన్నారు.
ఇది కూడా చదవండి: RCB Captain: మరో ట్రోఫీని అందుకున్న ఆర్సీబీ కెప్టెన్
మిచెల్ జాన్సన్ కూడా ఆరు ఐపీఎల్ సీజన్లు ఆడాడని గమనించాలి. ఈ లీగ్‌లో అతను ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమ్మిన్స్, నాథన్ లియాన్ వంటి విజయవంతమైన ‘బిగ్ ఫోర్’ బౌలింగ్ ఆస్ట్రేలియా భవిష్యత్తుకు ఖచ్చితంగా సరిపోదని జాన్సన్ అన్నారు. భవిష్యత్ గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది ’’ అని జాన్సన్ వ్యాఖ్యానించాడు.