warangal: కాళ్లను తాళ్లతో కట్టి కారులో బంధించి వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఉదంతం ఎట్టకేలకు వీడింది. వరంగల్ నగరంలో ఇటీవల జరిగిన ఈ దారుణ ఘటన మిస్టరీ వీడింది. కారులో మృతదేహాన్ని ఉంచి పరారైన దుండగుడి హత్యోదంతం తేలింది. ఆయన చావుకు కారణమైంది ఎవరు? ఎందుకు హత్య చేశారు? అసలేం జరిగింది? అన్న విషయాలను పోలీసులు తేల్చివేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని అసలు విషయాలను రాబట్టారు.
warangal: మృతుడిని హనుమకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన బ్యాంకు ఉద్యోగి వెలుగట్టి రాజామోహన్‌గా గుర్తించిన పోలీసులు.. హత్యోదంతంపై విచారణ జరిపారు. రాజామోహన్‌ను డబ్బు, బంగారం కోసమే దుండగుడు చంపినట్టు పోలీసులు నిర్ధారించారు. డబ్బు, నగలు తీసుకొని, అతన్ని హత్య చేసిన అనంతరం దుండగుడు పరారైనట్టు తెలిపారు.
warangal: రాజామోహన్‌ను ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లికి చెందిన జక్కుల శ్రీని అనే యూట్యూబర్ చంపేశాడని పోలీసులు తేల్చారు. రాజామోహన్‌కు మద్యం తాగించి, రోకలి బండతో కొట్టి చంపినట్టు నిందితుడు ఒప్పుకున్నాడని చెప్పారు. ఇతను గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య వద్ద పీఏగా పనిచేసినట్టు తెలిసింది. నిందితుడు శ్రీను గతంలో కూడా పలువురిని బెదిరించి, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్టు సమాచారం.