Warangal:

Warangal: ఆ ఎస్ఐపై వేటు ప‌డింది.. ద‌ళిత మ‌హిళ‌పై దాడికి సీపీ చ‌ర్య‌

Warangal: వ‌రంగ‌ల్ జిల్లాలో ఆగ‌స్టు నెల‌లో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌లో బాధ్యుడైన ఎస్ఐపై వేటు ప‌డింది. విచార‌ణ‌లో ఎస్ఐ త‌ప్పును నిర్ధార‌ణ చేసుకున్న పోలీస్ ఉన్న‌తాధికారులు ఎట్ట‌కేల‌కు చ‌ర్య‌లు తీసుకున్నారు. బ‌తుకు దెరువు కోసం ఫుట్‌పాత్‌పై చిరు వ్యాపారం చేసుకునే ఓ కుటుంబంపై దాడి చేసినందుకు ఏకంగా స‌స్పెండ్ చేస్తూ ఆదేశాల‌ను జారీ చేసింది.

Warangal: వ‌రంగ‌ల్ న‌గ‌రంలోని మిల్స్ కాల‌నీ ఎస్ఐ శ్రీకాంత్‌ను స‌స్పెండ్ చేస్తూ న‌గ‌ర సీపీ స‌న్‌ప్రీత్‌సింగ్ ఆదేశాలు జారీ చేశారు. వ‌రంగ‌ల్ ఫోర్ట్ రోడ్డులో ఫాస్ట్‌ఫుడ్ సెంట‌ర్ నిర్వ‌హిస్తున్న ద‌ళిత మ‌హిళ సండ్ర మ‌రియ‌మ్మ‌ను కులం పేరుతో దూషించి కొట్టాడ‌ని శ్రీకాంత్‌పై కేసు న‌మోదైంది. ఈ మేర‌కు విచార‌ణ చేపట్టిన ఎస్ఐ శ్రీకాంత్‌ను తాజాగా సస్పెండ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

Warangal: అర్ధ‌రాత్రి ఫాస్ట్‌ఫుడ్ సెంట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లిన ఎస్ఐ శ్రీకాంత్‌, మ‌రో కానిస్టేబుల్ ఆ సెంట‌ర్ య‌జ‌మానిరాలైన మ‌రియ‌మ్మ‌పై చేయిచేసుకున్నార‌ని, కులం పేరుతో దుర్భాష‌లాడార‌ని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న‌ది. త‌న సిలిండ‌ర్ తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తూ దౌర్జ‌న్యం చేశార‌ని తెలిపింది. త‌న త‌ల్లిని ఎందుకు కొట్టార‌ని అడిగిన త‌న కుమారుడిపై కూడా ఎస్ఐ దాడి చేశాడ‌ని తెలిపింది. ఈ మేర‌కు అదే మిల్స్ కాల‌నీ పోలీస్‌స్టేష‌న్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *