Warangal: వరంగల్ జిల్లా వరుడు. భద్రాద్రి-కొత్తగూడెం వధువు. ఇద్దరికీ ఓ మ్యారేజ్ బ్యూరో కలిపింది. ఆ తర్వాత చుపులు కలిసిన శుభవేళ వివాహ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇక ఆ నవ వధువు అత్తారింటిలో అడుగు పెట్టింది. రెండో రోజుకే ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. గమనించిన ఆ నవవరుడు.. ఆ వధువు ఫోన్‌ను పరిశీలించగా అసలు బాగోతం బట్టబయలైంది.
Warangal: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నిమిషకవి ఇందిరా (30) అనే యువతిని మ్యారేజ్ బ్యూరో ద్వారా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన యువకుడైన మట్టపల్లి దేవందేవర్‌రావు (31) వివాహం చేసుకున్నాడు. సుమారు రూ.4 లక్షలు ఖర్చు పెట్టి వివాహ వేడుకలను వరుడి కుటుంబ సభ్యులు ఘనంగా జరిపించారు. ఆ నవ వధువుగా భావించే ఇందిరాకు 8.5 తులాల బంగారు ఆభరణాలను వరుడి కుటుంబం కానుకలుగా పెట్టింది.
Warangal: ఇక అక్కడి నుంచే ఆ నవవధువుగా భావించే యువతిలో వచ్చిన మార్పును ఆ కుటుంబ సభ్యులు గమనించారు. రెండో రోజే ఆమె ప్రవర్తనను గమనించిన దేవందర్‌రావు.. ఆమె సెల్‌ఫోన్‌ను పరిశీలించాడు. ఆ సమయంలో అతనికి గుండె పగిలినంత పనైంది. ఓ చేదు నిజం కళ్లకు కట్టేలా కనిపించింది. ఆమెకు అప్పటికే పెళ్లయిందని, ఆమెకు ఓ కూతురు ఉన్నదని గుర్తించాడు.
Warangal: పెళ్లయిన విషయంపై, కూతురు ఉన్న విషయంపైనా ఆ యువతిని దేవేందర్‌రావు నిలదీశాడు. పెళ్లయిన మాట వాస్తవమేనని, కానీ విడాకులు తీసుకున్నానని ఇందిర కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఉదయం నిద్ర నుంచి లేచేసిరకే బంగారం, నగదుతో ఆ కిలాడీ లేడీ ఇందిర పరారైపోయింది. అవాక్కయిన ఆ కుటుంబ సభ్యులు మోసపోయామని గుర్తించారు.
Warangal: ఈ మేరకు తమను మోసగించిన కిలాడీ లేడీ ఇందిరపై, ఆమె తల్లిపై, మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులపై బాధితుడు దేవేందర్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ కిలేడీ చేసిన మరికొన్ని విషయాలు బహిర్గతమయ్యాయి. గతంలో ఇద్దరు, ముగ్గురు యువకులను ఇదే తరహాలో మోసగించినట్టు తేలిందని పోలీసులు తెలిపారు.

