Telangana: పెళ్లి చేసుకున్న పెళ్ళాం జోలికి ఎవ్వడు వచ్చిన అసలు ఊరుకోడు భర్త.. అదే సొంత బిడ్డలా చూసుకోవాల్సిన మామనే మోజు పడితే.. నా పెళ్ళాం మీదే మోజు పడ్తావా అని సొంత తండ్రిని హెచ్చరించిన కొడుకు.. అదే కోపం లో రగులుతున్న తండ్రి నిద్రలో ఉన్న కొడుకును చంపేశాడు… ఆడ దాని మీద మోజుతో సొంత కొడుకును కూడా వదలలేదు..
తెలంగాణలో మరో దారుణం జరిగింది. కోడలుపై మోజుతో కనిపెంచిన తండ్రే కొడుకును లేపేశాడు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించవద్దని హెచ్చరించినందుకు కుమారిడిపై దారుణానికి పాల్పడ్డాడు. రోకలి బండతో కొట్టి కొట్టి చంపాడు. ఈ దారుణమైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేపాకపల్లిలో చోటుచేసుకుంది.
Also Read: Hyd: చేపల కూర కోసం హత్య చేసిన స్నేహితులు..
ఈ మేరకు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేపాకపల్లికి చెందిన కాసం ఓదెలు, తన భార్య, కొడుకుతో కలిసి తల్లిదండ్రులు సారక్క, మొండయ్యలతో కలిసి నివసిస్తున్నాడు. ఓదెలు 108 అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా 14 ఏళ్ల కిందట పెళ్లైంది. అయితే కొంతకాలంగా మొండయ్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో గొడవలు జరుగుతున్నాయి. మొండయ్య కోడలితో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా బంధువులు పంచాయితీ పెట్టి హెచ్చరించారు. అయినా మారని మొండయ్య అలాగే ప్రవర్తిస్తున్నాడు. అయితే ఓదెలు తమ పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్నాడు. అప్పుడు తాగి ఇంటికొచ్చి తండ్రి మొండయ్య కొడుకుతో గొడవపడ్డాడు.
ఎప్పటినుంచో పగతో రగిలిపోతున్న మొండయ్య కొడుకును చంపాలని ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇంటి ముందు పడుకున్న కొడుకు ఓదెలు తలపై రోకలి బండతో కొట్టాడు. దీంతో తీవ్ర గాయమైన ఓదెలు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం మొండయ్య పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, చిట్యాల సీఐ మల్లేశ్, ఎస్సై సందీప్‌కుమార్ తెలిపారు.