Kamal Haasan

Kamal Haasan: సనాతన సంకెళ్లపై యుద్ధం.. కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు!

Kamal Haasan: కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి తెరలేపాయి. సూర్య అరగం ఫౌండేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సనాతన సంకెళ్లను బద్దలు కొట్టేందుకు విద్య ఏకైక ఆయుధమని అన్నారు. జ్ఞానమే అసలైన శక్తి అని, విద్య లేకపోతే మూర్ఖత్వం గెలిచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నీట్ విధానం పేద విద్యార్థుల అవకాశాలను దూరం చేస్తోందని విమర్శించారు. నాయకత్వం అంటే పదవి కాదు, సమాజంతో కలిసిపోవడమని చెప్పారు. సామాజిక సేవలో ముళ్ల కిరీటమే లభిస్తుందని, దాన్ని స్వీకరించాలంటే ధైర్యం కావాలని అన్నారు. ప్రస్తుతం కమల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయంశంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *