War 2: వార్ 2 సినిమా హిందీలో మొదటి రోజు బుకింగ్స్ గురించి హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది భారీ చిత్రాలతో పోటీ పడుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. నేషనల్ మల్టీప్లెక్స్‌లలో టికెట్ సేల్స్ ఎలా ఉన్నాయి? ఇతర బిగ్ బడ్జెట్ చిత్రాలతో పోలిస్తే వార్ 2 ఎక్కడ నిలిచింది? ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా గురించి ఫ్యాన్స్ ఎందుకు ఇంత ఉత్సాహంగా ఉన్నారు?
Also Read: war 2 pre release event: ఆ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంతకాలం నన్ను ఎవరూ ఆపలేరు: Jr. ఎన్టీఆర్
హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ నటించిన వార్ 2 హిందీలో మొదటి రోజు 20,000 టికెట్లు అమ్ముడయ్యాయి. పీవీఆర్ ఇనాక్స్‌లో 14,500, సినీపోలిస్‌లో 4,750 టికెట్లు బుక్ అయ్యాయి. అయితే, సైయారా (34,000), ఛావా (27,000) చిత్రాలతో పోలిస్తే ఈ బుకింగ్స్ తక్కువగా ఉన్నాయి. పఠాన్, జవాన్, పుష్ప 2 వంటి రికార్డ్ బ్రేకింగ్ చిత్రాలతో పోటీలో వార్ 2 వెనుకబడింది. మూడు రోజుల ముందు బుకింగ్స్ ఓపెన్ అయినప్పటికీ, ఇక నుంచి ఊపందుకునే అవకాశం ఉంది. 5,000 స్క్రీన్స్‌లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందో? లేదో చూడాలి.