Kiara Advani: బాలీవుడ్ స్టార్ కియారా అద్వానీ కెరీర్‌లో ఊహించని మలుపు వచ్చింది. ‘వార్ 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. మూడు సినిమాల డీల్ రద్దయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
Also Read: Hit Jodis: సీనియర్ స్టార్ జోడీల సందడి!
కియారా అద్వానీ బాలీవుడ్‌లో మంచి గుర్తింపు సాధించిన నటి. అయితే, ‘వార్ 2’ సినిమా ఫెయిల్యూర్ ఆమె కెరీర్‌ను కుదిపేసింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మల్టీస్టారర్ చిత్రం తొలి వీకెండ్‌లో బాగా ఆడినా, తర్వాత కలెక్షన్స్ బాగా తగ్గాయి. దీంతో నిర్మాతలకు భారీ నష్టం వచ్చింది. ఈ సినిమాలో కియారా గ్లామరస్ రోల్‌లో కనిపించినా, కథలో బలం లేకపోవడం, స్క్రీన్‌ప్లే ఆకట్టుకోలేకపోవడం వల్ల ప్రేక్షకులు నిరాశపడ్డారు. యష్ రాజ్ ఫిల్మ్స్‌తో కియారా చేసుకున్న మూడు సినిమాల ఒప్పందం ఇప్పుడు సందిగ్ధంలో పడింది. స్పై యూనివర్స్‌లో కొత్త నటీమణులను తీసుకొచ్చే ఆలోచనలో వైఆర్ఎఫ్ ఉందని టాక్. ఇటీవల తల్లి అయిన కియారా, మెటర్నిటీ బ్రేక్‌లో ఉండటం కూడా కొత్త ప్రాజెక్టులకు ఆటంకంగా మారింది. ఈ ఫ్లాప్ బాలీవుడ్ యాక్షన్ సినిమాల ట్రెండ్‌ను మార్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రేక్షకులు ఇప్పుడు కంటెంట్ ఆధారిత కథలను ఎక్కువగా ఆదరిస్తున్నారు.