Dry Fruits For Weight Loss

Dry Fruits For Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఈ డ్రైఫ్రూట్స్​ని నానబెట్టి తినండి

Dry Fruits For Weight Loss: అంజీర్ అంటే అందరూ ఇష్టపడి తింటారు. ఈ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ తీపి రుచిగల అంజీర్​లో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ K, విటమిన్ B6 వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వాటిని అలాగే తినడం కంటే, రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తినడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది: మలబద్ధకంతో బాధపడేవారికి నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది ప్రేగు కదలికలు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది

అధిక రక్తపోటు నియంత్రణ: అధిక రక్తపోటును నియంత్రించడానికి పొటాషియం చాలా అవసరం. ఈ నానబెట్టిన అంజీర్ పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఉదయం తీసుకుంటే, అవి అధిక రక్తపోటును నియంత్రిస్తాయి.

చర్మ ఆరోగ్యం: అంజీర్ పండ్లలో చర్మ ఆరోగ్యానికి చాలా అవసరమైన విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఈ నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందడానికి సహాయపడుతుంది.

Also Read: Banana Benefits: వామ్మో.. రోజు 1 అరటిపండ్లు తింటే ఇన్ని లాభాలా?

ఎముకలను బలపరుస్తుంది: అంజీర్ పండ్లలో కాల్షియం, పాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి.

చక్కెర స్థాయిల నియంత్రణ: నానబెట్టిన అంజీర్ పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఈ పండులో అబ్సిసిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం, క్లోరోజెనిక్ ఆమ్లం వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి.

గుండె ఆరోగ్యానికి మంచిది: అంజీర్‌లోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

బరువు తగ్గడం : శరీర బరువు తగ్గాలనుకునేవారికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం మంచిది. అందువల్ల, మీరు అంజీర్ పండ్లను మీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pickle Preservation Tips: ఊరగాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *