Health Tips: ప్రస్తుత కాలంలో ఉదయం నిద్రలేవడం అనేది చాలా మందికి బిగ్ టాస్క్. పొద్దుపోయేదాక హాయిగా పడుకుంటారు. మరికొంత మంది ఉద్యోగాల కోసం అలారం పెట్టుకుని లేస్తారు. కానీ ప్రతిరోజూ అలారంతో నిద్ర లేవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. గాఢ నిద్రలో ఉన్న వ్యక్తిని అలారం వచ్చిన వెంటనే అకస్మాత్తుగా లేవడం వల్ల శరీరం ప్రతికూలంగా స్పందిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో మెదడు అత్యవసరంగా తన పనిని ప్రారంభించడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉందని ఇటీవలి అధ్యయనంలో తేలింది.
అలారం ప్రమాదాన్ని తెస్తుంది!
వర్జీనియా విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం ప్రకారం.. ప్రతి ఉదయం అలారంతో మేల్కొనే వారిలో 74 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అదే విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనంలో అలారం లేకుండా సహజంగా మేల్కొనే వారికి రక్తపోటు వంటి సమస్యలు తక్కువగా ఉంటాయని తేలింది. సడెన్‌గా అలారం వచ్చిన వెంటనే మేల్కొన్నప్పుడు.. శరీరం అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది హృదయ స్పందన రేటును పెంచుతుంది. అంతేకాకుండా తాత్కాలికంగా రక్తపోటును పెంచుతుంది. దీనిని సాధారణంగా మార్నింగ్ హైపర్‌టెన్షన్ అంటారు.
Also Read: Health Tips: శరీరం ఫిట్‌గా ఉండాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
తాత్కాలిక అధిక రక్తపోటు సాధారణంగా అంత ప్రమాదకరం కాదని భావించినప్పటికీ.. అది ప్రతిరోజూ పునరావృతమైతే అది మరింత ప్రమాదకరమని అంటారు. అధ్యయనాల ప్రకారం.. ఉదయం పూట అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్‌కు దారితీస్తుంది. ఇది ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది.
ప్రమాదాన్ని నివారించడానికి ఏమి చేయవచ్చు?
ప్రతిరోజూ వీలైనంత త్వరగా పడుకుని మేల్కొవడానికి ప్రయత్నించాలి. అప్పుడు అలారం అవసరం ఉండదు. రోజుకు 7-8 గంటల నిద్ర అవసరం. ఇది మీ శరీరంలోని రక్తపోటును కూడా ప్రభావితం చేస్తుంది. మీరు ఖచ్చితంగా అలారం మోగిస్తూ నిద్రపోవాల్సి వస్తే, సాధ్యమైనంత మృదువైన సౌండ్‌ను ఎంచుకోవాలి. అలాగే బయట పడుకోవడం వల్ల మార్నింగ్ వెలుతురు మేల్కొల్పుతాయి. కాబట్టి అలారం అవసరం లేదు. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం.. మేల్కొనడం వల్ల కూడా ఆరోగ్యానికి మంచిది.