Delhi: లోక్‌సభలో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ – విపక్షాలపై అమిత్ షా ఫైర్

Delhi: లోక్‌సభలో ఆపరేషన్ సింధూర్‌పై జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా విపక్షాల తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ విదేశాంగ శాఖ ప్రకటించిన విషయాలను పట్టించుకోకుండా ఇతర దేశాల వర్గాల వ్యాఖ్యల్ని విశ్వసించడం సరికాదని విపక్షాలను ధ్వజమెత్తారు.

“మన ప్రభుత్వాన్ని కాకుండా విదేశీ వర్గాల చెప్పినదానిని నమ్మడమేంటి?” అని ప్రశ్నించిన అమిత్‌ షా, ఇది దేశ ప్రయోజనాలను విస్మరించిన తీరుగా అభివర్ణించారు. దేశ భద్రత, గౌరవం మీద రాజకీయ లాభాల కోసం ఆడుకోవడం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు.

అలాగే, “మీ పార్టీ సంప్రదాయాలను ఈ సభపై రుద్దకండి. దేశ ప్రయోజనాల విషయంలో పార్టీ పరంగా కాకుండా ఏకగ్రీవంగా ముందుకెళ్లాలి,” అని వ్యాఖ్యానించారు. ఇటువంటి తీరుతో విపక్షాలు మరో 20 ఏళ్లు అధికారంలోకి రాకపోవచ్చని ఎద్దేవా చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *