AP News: విశాఖపట్నంలో ఈరోజు ఉదయం పెద్ద ప్రమాదం జరిగింది. ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి శ్రీకాకుళం వెళ్లాల్సిన బస్సు అకస్మాత్తుగా అదుపు తప్పి దూసుకెళ్లింది. బస్సు నేరుగా ప్లాట్‌ఫామ్ మీదకు ఎక్కి, అక్కడ బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులను ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరోవ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. అయితే, డ్రైవర్ నిర్లక్ష్యం కారణమైందా? లేక వాహన లోపమా? అన్న విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Chalamalla krishna reddy: రాజగోపాల్‌రెడ్డిపై కాంగ్రెస్ నేత ఫైర్
విశాఖ ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు ఈ ఘటనపై స్పందిస్తూ – “ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. డ్రైవర్ అవగాహన లోపం కూడా కారణం కావచ్చు. బస్సు వేగంగా వెళ్తున్నట్లు ఎక్కడా రికార్డుల్లో కనిపించలేదు. ప్లాట్‌ఫామ్‌కి వచ్చే ప్రతి బస్సుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాం” అని తెలిపారు.
ఈ ఘటనతో అక్కడ ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కాసేపటి క్రితం పక్కనే ఉన్న మహిళ ప్రాణాలు కోల్పోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది.

