Helmet Challan for Car Driver

Helmet Challan for Car Driver: హెల్మెట్ లేదు.. చలానా కట్టు.. కారు ఓనర్ కి షాకిచ్చిన పోలీసులు!

Helmet Challan for Car Driver: విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ఒకాయనకు పొద్దున్నే ఒక చలాన్  వచ్చింది. అది ట్రాఫిక్ పోలీసుల నుంచి. ఏమిటా అని చూస్తే.. మీరు విశాఖపట్నంలో ఫలానా రోజున హెల్మెట్ లేకుండా వెళ్లారు. చలాన్ కట్టాలి అని వుంది. అది చూసి షాక్ అయ్యారు ఆ వ్యక్తి. ఎందుకంటే, ఈ మధ్యకాలంలో ఆయన విశాఖపట్నం వెళ్ళింది లేదు. అదీకాకుండా తనకు వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో అది తన కారు నెంబర్. దీంతో ఇంకా మతిపోయింది ఆయనకు. కారులో హెల్మెట్ ఏమిట్రా బాబూ అనుకుంటూ ట్రాఫిక్ పోలీసుల వద్దకు పరిగెత్తారు. 

ఒక్కోసారి పోలీసు డిపార్ట్మెంట్ చేసే పనులకు నవ్వాలో.. ఏడవాలో అర్ధంకాదు జనాలకు. పైన చెప్పిన ఘటన ఇలాంటిదే. నిజానికి ఇది ఒక వైజాగ్ లో బైక్ నడిపిన వ్యక్తికీ వెళ్లాల్సిన చలాన్. అది ఎక్కడో ఉన్న కారు ఓనర్ కి వెళ్ళింది. దీనికి కారణం ఆ రెండు వాహనాల నెంబర్లలో ఉన్న సారూప్యత. అసలు చలాన్ వెళ్లాల్సిన నెంబర్ AP 39 SR 8417. ఇది ఒక బైక్ కానీ, చలాన్ పంపిన నెంబర్ AP 39 SR 8471 ఇది పైన చెప్పుకున్న వ్యక్తికీ చేయండిన కారు. నెంబర్ పొరపాటుతో వచ్చిన గందరగోళం ఇది. 

ఇది కూడా చదవండి: Campfire: చెత్తతో చలిమంట వేసుకున్నారు.. కట్ చేస్తే.. కన్నుమూశారు!

Helmet Challan for Car Driver: ఈ సంఘటన పూర్తి వివరాలలోకి వెళితే.. విశాఖలోని  ద్వారకానగర్ డే అండ్ నైట్ హాస్పిటల్ సెంటర్ లో AP 39 SR 8417 నెంబర్ బైక్ పై ఒక వ్యక్తి హెల్మెట్ లేకుండా వెళుతున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసులు ఫోటో తీశారు. ఆ తరువాత చలాన్ సిద్ధం చేశారు. ఆ సమయంలో పొరపాటున వెహికిల్ నెంబర్ AP 39 SR 8471 గా టైప్ చేయడంతో విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన బ్యాంక్ ఉద్యోగి సతీష్ కారుపై హెల్మెట్ ధరించలేదంటూ చలాన్ తయారైంది. దీంతో చలాన్ సతీష్ కు చేరింది. తానెప్పుడూ వైజాగ్ వెళ్ళలేదు. పైగా తన కారుతో ఈమధ్యకాలంలో అసలు వెళ్ళలేదు. కానీ, ఈ చలాన్ ఏమిటా అనుకున్న సతీష్ కు హెల్మెట్ లేకపోవడం వలన చలాన్ అని చూసేసరికి నవ్వాలో .. ఏడవాలో అర్ధం కాక పోలీసులకు విషయాన్ని చెప్పారు. దీంతో పోలీసులు జరిగిన పొరపాటును గ్రహించి చలాన్ సరిచేశారు. 

ఏదిఏమైనా ఇది చిన్న విషయం కాబట్టి సరిపోయింది. ఏదైనా ఏక్సిడెంట్ కేసుల్లో ఇలా నెంబర్ గందరగోళం చేస్తే ఇబ్బంది పెద్దగా ఉంటుంది కదా అని విషయం తెలిసిన వారు అనుకుంటున్నారు. ఒకటికి రెండు సార్లు పరిశీలించకుండా చలాన్లు పంపించేస్తే ఎలా అని ప్రజలు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *