Visakhapatnam: బిడ్డ ..ఆడకు ..నానా అలంటి ఆటలు. ఈ ఒక్క మాటే చెప్పింది .నాకే చెబుతావా అని ..సైలెంట్ గా స్కెచ్ వేసాడు. అమ్మ కంటే ఎక్కువ ఆ ఆట ఎందుకు అయింది అంటే…పోయేకాలం వస్తే అంతే . సో .,.ఆలా అమ్మనే ఆ ఆట కోసం చంపేయాలి అని ఎందుకు అనుకున్నాడు. ఉంది పెద్ద కారణమే …
తన క్షణిక ఆనందం కోసం.. నవ మాసాలు మోసి పెంచి పోషించిన కన్న తల్లినే హతమార్చాడు ఓ కసాయి కొడుకు. కేవలం ఆన్‌లైన్ గేమ్స్ వద్దని మందలించినందుకు కన్న తల్లినే కడతేర్చేశాడు. కత్తితో విచక్షణ రహితంగా ఆన్‌లైన్ గేమ్స్ వద్దని దాడి చేసి చంపేశాడు. విశాఖ జిల్లాలోని మల్కాపురం పీఎస్ పరిధిలో ఈ దారుణం జరిగింది. కోస్ట్ గార్డ్ కమాండెంట్‌గా పనిచేస్తున్న బల్బీర్ సింగ్ ఫ్యామిలీగా గుర్తించారు.
విశాఖ జిల్లా నేవీ మల్కాజిపురంలో ఈ దారుణం చోటుచేసుకుంది. సముద్ర తీర ప్రాంతం నేవి ఏరియా కోస్ట్ క్వాటర్స్‌లో ఆమె మృతిదేహాన్ని కొందరు గుర్తించారు. అనంతరం పోలీసులు సమాచారం అందించారు. ఘటనా స్తలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతురాలు శరీరంపై పలు గాయాలతో రక్తపు మడుగుల్లో పడి ఉన్నారు. మృతురాలు భర్త ఇండియన్ నేవి అధికారిగా గుర్తించారు. అనంతరం మృతిదేహాన్ని పోలీస్టేషన్‌కు తరలించారు.
కొడుకు విపరీతంగా ఆన్‌లైన్ గేమ్స్ బానిసకావడంతో.. వద్దని తల్లి మందలించిది. మొబైల్, ల్యాప్‌టాప్ లాక్కుంది. దీంతో కోపంతో రగిలిపోయిన కుమారుడు.. పక్కనే ఉన్న కత్తి తీసి తల్లిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. కొడుకు దాడిలో తల్లి అల్కా సింగ్ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో భయపడి అక్కడ నుంచి పారిపోయాడు కొడుకు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
