Viveka Case: వివేక మాజీ పిఏ కృష్ణారెడ్డి ప్రైవేటు కేసు పై దర్యాప్తులో వేగం పెంచిన పోలీస్ లు. విచారణకు రావాలంటూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బంధు గణానికి పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ కి నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్న వారిలో జగన్ బావమరిది ఈసీ సురేంద్ర నాథ్ రెడ్డి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, బాబాయ్ మనోహర్ రెడ్డి. తమ్ముడు అభిషేక్ రెడ్డి వైయస్సార్ ట్రస్ట్ చైర్మన్ జనార్దన్ రెడ్డి న్యాయవాది ఓబుల్ రెడ్డి ఉన్నారు.
Viveka Case: వేళ్ళతో పాటు ఐదుగురు సాక్షులకు కూడా పోలీస్ లు నోటీసులు ఇచ్చారు. ఈనెల 5 తేదీ విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. గతేడాది డిసెంబరు 15న కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా, వివేకా కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర్ రెడ్డి సిబిఐ ఎస్పి రామ్ సింగ్ పై ప్రైవేటు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో కేసు పైన మళ్లీ పోలీస్ లు విచారణ జరుపుతున్నారు.పది రోజుల కిందట కృష్ణారెడ్డిని విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. తాజాగా మరో 10 మందిని విచారించేందుకు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంచరించుకుంది.