Rajinikanth: సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో తెలుగు దర్శకుడు వివేక్ ఆత్రేయ సినిమా చేసే జాక్ పాట్ ఛాన్స్ కొట్టేశాడు. ఈ చిత్రం అత్యంత భారీగా తెరకెక్కనుందని టాక్. ‘బ్రోచేవారెవరురా’, ‘సరిపోదా శనివారం’ లాంటి హిట్స్‌తో ఆకట్టుకున్న వివేక్, రజనీ కోసం పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. రజనీ ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో కోలీవుడ్‌లో సత్తా చాటిన మైత్రీ, ఇప్పుడు రజనీతో సంచలన ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టింది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.
Also Read: Kajal Aggarwal: బాలీవుడ్ రామాయణంలో కాజల్ అగర్వాల్?
Rajinikanth: యంగ్ హీరోలతో విభిన్న కథలతో మెప్పించిన వివేక్, సూపర్‌స్టార్ రజనీని ఎలా చూపిస్తారనే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ కాంబో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా కోలీవుడ్‌లో సరికొత్త ఒరవడి సృష్టించనుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
జైలర్ 2 – ప్రకటన టీజర్ ఇక్కడ చూడండి :