Vishwambhara

Vishwambhara: విశ్వంభర: చిన్న హీరో సినిమాకి అడ్డు?

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సోషియో ఫాంటసీ జోనర్‌లో వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతోంది. విజువల్ ట్రీట్‌గా రానున్న ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను గతంలో వాయిదా వేసిన మేకర్స్, ఇప్పుడు జూలై 4న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, అదే రోజున నితిన్ నటిస్తున్న ‘తమ్ముడు’ కూడా రిలీజ్ కానుంది.

Also Read: Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్: హైప్ రెట్టింపు చేసిన డైరెక్టర్?

Vishwambhara : ఈ డేట్ క్లాష్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం చెలాయిస్తే, ‘తమ్ముడు’ పరిస్థితి ఏమిటని చర్చ నడుస్తోంది. చిరంజీవి ఈ డేట్‌ను ఫిక్స్ చేస్తారా లేక వేరే రోజుని ఎంచుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. అభిమానులు ఈ రిలీజ్ రేసుపై ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *