Vishvambhara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న భారీ చిత్రం “విశ్వంభర”ని యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం మెగా అభిమానులు చాలా కాలం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ, ఇంకా విడుదల కాలేదు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు త్వరలో శుభవార్త అందబోతుందని టాక్ వినిపిస్తోంది.
Also Read: Peddi Glimpse Update: పెద్ది గ్లింప్స్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. అప్పుడే రిలీజ్
Vishvambhara: మొదట్లో ఈ సినిమాని మే 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు, కానీ ఆ డేట్‌ని పవన్ కళ్యాణ్ తీసుకోవడంతో, ఇప్పుడు మెగాస్టార్ తన బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ డేట్‌ని టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. అంటే, మెగాస్టార్ సూపర్ హిట్ చిత్రం “ఇంద్ర” రిలీజ్ డేట్ అయిన జూలై 24న “విశ్వంభర”ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.
దీంతో కాస్త ఆలస్యమైనప్పటికీ, మంచి సెంటిమెంట్ డేట్‌తోనే చిత్ర బృందం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చెప్పొచ్చు. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
విశ్వంభర అధికారిక టీజర్ ఇక్కడ చూడండి :

