Kerala

Kerala: సంచలనంగా మారిన కేరళకు చెందిన మహిళ విష్ణుజ మరణం

Kerala: కళ్ళు దొబ్బాయి..ఆ మొగుడికి. పెళ్లి టైములో అప్సరస అనుకుని పెళ్ళైన తర్వాత ..ఆబ్బె అసలు బాగోలేవు అనేశాడు. ఒక్క మాటలేనా…అంతకు మించి మూర్కంగా ప్రవర్తించాడు. కొట్టడం ..తిట్టడం…చి పో అంటూ ఇంట్లో వాళ్ళు అందరు అనడం. ఎలా ఉంటుంది ఆ అమ్మాయికి . నీకు అందం లేదు..వుద్యోగం కూడా లేదు..నిద్ర లేస్తే ఇదే మాటలు వినిపిస్తూ ఉంటె ఎవరైనా ఎన్ని రోజులని భరిస్తారు. చివరకు ఏమైంది.

కేరళకు చెందిన మహిళ విష్ణుజ మరణం సంచలనంగా మారింది. భర్త, అత్తింటి వారి అవమానాలు, హింసను ఎదుర్కొన్న మహిళ మరణించింది. గత వారం కేరళలోని మలప్పురం లోని తన ఇంట్లో 25 ఏళ్ల విష్ణుజ మరణించి కనిపించింది. ఈ కేసులో భర్త, వారి బంధువులు ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణంగా సంబంధించి సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Hyderabad: మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ లో సంచలన నిజాలు..

బాధితురాలు విష్ణుజకి, ప్రభిన్ అనే వ్యక్తికి 2023లో వివాహం జరిగింది. వీరిద్దరిని పెద్దలు కుదిర్చిన వివాహం. అయితే, పెళ్లి తర్వాత నుంచి ప్రభిన్ విష్ణుజని క్రమం తప్పకుండా అవమానిస్తుండే వాడు. ఆమె అందంగా లేదని, ఉద్యోగం రాలేదని ఆమెను అవమానించేవాడని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. శారీకరంగా, మానసికంగా తీవ్ర హింసకు గురైనట్లు తెలుస్తోంది.

విష్ణుజ తండ్రి వాసుదేవన్ మాట్లాడుతూ.. తన అల్లుడు తన బిడ్డను కొట్టాడని తనకు తెలియదని చెప్పాడు. ఆమె సన్నగా ఉందని తిట్టే వాడని, చివరకు తన బైక్‌పై కూడా కూర్చోనిచ్చేవాడు కాదని చెప్పారు. పెళ్లి తర్వాత ఉద్యోగం లేదని, తన జీతంపై ఆశ పడొద్దని చెప్పేవాడని, దీంతో తన కూతురు కొన్ని పరీక్షలు రాసిందని, ఆమె చాలా ప్రయత్నించినా ఉద్యోగం ఉద్యోగం రాలేదని చెప్పారు. విష్ణుజ గతనకు వేధింపుల గురించి చెప్పలేదని, ఆమె మరణించిన తర్వాత ఆమె స్నేహితుల ద్వారా మాత్రమే తెలుసుకున్నానని చెప్పారు. తన బిడ్డను అతడే హత్య చేసి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vemulawada: వేములవాడలో దారుణ హత్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *