Aryan: తమిళ స్టార్ హీరో విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ “ఆర్యన్” విడుదల వాయిదా పడింది. మొదట అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు నవంబర్ 7, 2025న థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు వెర్షన్ రిలీజ్‌ను వాయిదా వేసిన ఈ నిర్ణయం సినీ వర్గాల్లో ప్రశంసలు పొందుతోంది.
ప్రవీణ్ కె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మించింది. శుభ్రా, ఆర్యన్ రమేశ్ సహనిర్మాతలుగా వ్యవహరించారు. క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. విష్ణు విశాల్ ఈ సినిమాలో కొత్త లుక్‌లో కనిపించబోతుండగా, టీజర్‌తోనే మంచి హైప్ క్రియేట్ అయింది.
Also Read: Mahakaali: ప్రశాంత్ వర్మ నుంచి మరో సంచలనం?
తెలుగు విడుదల వాయిదా వెనుక కారణం కూడా సెన్సిబుల్‌గా ఉందని పరిశ్రమలో చర్చ జరుగుతోంది. అదే వారంలో రవితేజ నటించిన “మాస్ జాతర”, ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన “బాహుబలి: ది ఎపిక్” సినిమాలు విడుదల కావడంతో, వాటికి స్పేస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్యన్ టీమ్ ఈ నిర్ణయం తీసుకుంది. పెద్ద సినిమాలకు పోటీ ఇవ్వకుండా, గౌరవం చూపించడం విష్ణు విశాల్ టీమ్ తీసుకున్న సరైన నిర్ణయంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొల్పడంలో ఇలాంటి చర్యలు చాలా అవసరమని పలువురు సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఈ నిర్ణయాన్ని సానుకూలంగా స్వాగతిస్తున్నారు. నవంబర్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న “ఆర్యన్” సినిమాపై ఇప్పుడు అంచనాలు మరింత పెరిగాయి.

