Madhagajaraja Telugu Trailer

Madhagajaraja Telugu Trailer: విడుదలైన ‘మదగజరాజ’ తెలుగు ట్రైలర్

Madhagajaraja Telugu Trailer: జనవరి మాసం డబ్బింగ్ సినిమాతో మొదలై, డబ్బింగ్ సినిమాలతో పూర్తి అవుతోంది. ఈ నెల 1వ తేదీ మలయాళ అనువాద చిత్రం ‘మార్కో’ విడుదలైంది. ఇప్పుడు జనవరి 31న రెండు అనువాద చిత్రాలు విడుదల అవుతున్నాయి. ఇవి రెండు తమిళ డబ్బింగ్ చిత్రాలే కావడం విశేషం. ఇందులో ఒకటి ‘అగాతియా’ కాగా, మరొకటి పొంగల్ కానుకగా తమిళంలో విడుదలైన ‘మదగజరాజ’. సి. సుందర్ దర్శకత్వంలో జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ సంస్థ నిర్మించిన ‘మదగజరాజ’లో విశాల్ హీరోగా నటించగా, వరలక్ష్మీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. సదా స్పెషల్ సాంగ్ లో నర్తించింది. ఈ సినిమాను జనవరి 31న తెలుగునాట విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ నూ రిలీజ్ చేశారు. దాదాపు పన్నెళ్ళు ఆలస్యంగా వచ్చిన ‘మదగజరాజ’ తమిళంలో మంచి విజయాన్ని సాధించి, పొంగల్ విజేతగా నిలిచింది. మరి తెలుగులో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *