Vishal: విశాల్ 35 చిత్రం ఘనమైన పూజా కార్యక్రమంతో చెన్నైలో ప్రారంభమైంది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఆర్బీ చౌదరి నేతృత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తమ 99వ ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందింది. రవి అరసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో విశాల్‌తో పాటు దుశారా విజయన్ కీలక పాత్రలో నటిస్తోంది. 45 రోజుల షూటింగ్ షెడ్యూల్ చెన్నై నుంచి ప్రారంభమై, విశాఖపట్నం, జైపూర్‌లలో కొనసాగనుంది.
Also Read: Sivakarthikeyan: సంచలనం.. శివకార్తీకేయన్‌తో వెంకట్ ప్రభు కొత్త సినిమా!
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. విశాల్ ఇటీవలి చిత్రం మధ గజ రాజా విజయం తర్వాత, ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్, డ్రామాతో కూడిన ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేయనుందని టాక్. సూపర్ గుడ్ ఫిల్మ్స్ లెగసీని కొనసాగిస్తూ, ఈ చిత్రం 2026లో థియేటర్లలో సందడి చేయనుంది.
And here we go, finally after the grand success of #MadhaGajaRaja, starting my next film #vishal35 under the production of @SuperGoodFilms_ produced by #RBchoudhary sir marking their 99th film directed by @dir_raviarasu It’s our first collaboration. Sharing screen space with me… pic.twitter.com/fxM5meY7hc
— Vishal (@VishalKOfficial) July 14, 2025