Viral Video: ఉత్తరప్రదేశ్ ఔరైయా జిల్లాలో ఒక రైతుకు కోతి రూపంలో ఊహించని కష్టం ఎదురైంది. భూమి రిజిస్ట్రేషన్ కోసం తన మోపెడ్‌లో ఉంచిన రూ. 80 వేల నగదు సంచిని ఒక కోతి ఎత్తుకెళ్లింది. ఆ కోతి డబ్బు సంచితో ఒక చెట్టుపైకి ఎక్కి, అందులోని నోట్లను గాలిలో వెదజల్లడం మొదలుపెట్టింది. దీంతో రోడ్డుపై పోతున్న జనం ఆ నోట్లను ఏరుకోవడం మొదలుపెట్టారు.
ఈ విచిత్రమైన ఘటన చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. చాలామంది డబ్బులు ఎత్తుకెళ్తుంటే, ఆ రైతు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. చివరకు, ఆ రైతుకు రూ. 52 వేలు మాత్రమే తిరిగి లభించాయి. కోతి ఎత్తుకెళ్లిన డబ్బులో రూ. 28 వేలు గల్లంతయ్యాయి. ఈ సంఘటన స్థానికంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలాంటి సంఘటనలు చూసి జాలిపడాలో, నవ్వాలో తెలియక ప్రజలు అయోమయంలో పడ్డారు.
నోట్లను విరజల్లిన కోతి
భూమి రిజిస్ట్రేషన్ కోసం ఔరైయా జిల్లాలో రైతు మోపెడ్‌లో ఉంచిన రూ.80 వేల నగదు కోతి ఎత్తుకెళ్లింది.
చెట్టుపై నుంచి నోట్లు వెదజల్లగా ప్రజలు ఏరేసుకుని పోయారు.
చివరకు రైతు వద్దకు చేరింది కేవలం రూ.52 వేలే. pic.twitter.com/h0USxwaQul
— greatandhra (@greatandhranews) August 27, 2025