Puri Jagannadh: సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్న ఆ ఒక్క పెంగ్విన్ వీడియో అందరి చర్చనీయాంశంగా మారింది. 15 ఏళ్ల క్రితం వీడియో ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతోంది? దీని వెనుక ఉన్న కథ ఏమిటి? అనేది ఆసక్తికరంగా మారింది. మన టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ పాడ్‌కాస్ట్‌లో చెప్పిన భావోద్వేగ కథ ఆడియన్స్‌ను కనెక్ట్ చేసింది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Sumathi Sathakam: ‘సుమతీ శతకం’ నుంచి మెలోడీ సాంగ్ ‘సుమతి సుమతి’ విడుదల!
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ ఒక్క పెంగ్విన్ వీడియోనే చర్చ అవుతోంది. రెండు పెంగ్విన్లు నడుస్తుంటే ఒకటి ఆగిపోతుంది, మరొకటి సీరియస్‌గా కొండ వైపు వెళ్లిపోతుంది. ఈ వీడియో 2007లో వెర్నర్ హెర్జోడ్ దర్శకత్వంలో వచ్చిన డాక్యుమెంటరీలోనిది. అయితే దీని వెనుక కథ ఏమిటని చాలామందికి తెలియదు. పూరి జగన్నాథ్ తన పాడ్‌కాస్ట్‌లో ఈ పెంగ్విన్ కథను వివరించారు. మగ పెంగ్విన్ తన జోడికి అత్యంత నమ్మకంగా ఉంటుంది. ఆడ పెంగ్విన్ చీట్ చేస్తే మగ పెంగ్విన్ బ్రేకప్ తట్టుకోలేక జాతిని వదిలి దూరంగా వెళ్లి ఆకలితో చనిపోతుందట. ఈ విషాద కథతో నెటిజన్లు తమ డిప్రెషన్‌కు సింబాలిక్‌గా ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ పాత వీడియో ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతోంది.
