Viral News:

Viral News: ఆ దేశంలో ఎరువు రంగు లిప్‌స్టిక్ నిషిద్ధం.. ఎందుకో తెలుసా?

Viral News:లిప్‌స్టిక్ అంటే పిగ్మెంట్లు, నూనెలు, మైనంతో త‌యారు చేసే ఒక కాస్మెటిక్ వ‌స్తువు. ఇది పాశ్చాత్య సంస్కృతా! ఆధునిక పోక‌డో! కానీ స‌మ‌కాలీన ప్ర‌పంచంలో మ‌హిళ‌ల్లో పెద్ద సంఖ్య‌లో దీని వాడ‌కం రోజురోజుకూ పెరుగుతున్న‌ది. మ‌గువులు అందంకోసం ఆచ‌రించే మార్గాల్లో ఇదీ ఒక‌టి. దీనిని ఆత్మ‌విశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్కెట్ల‌లో అనేక ర‌కాల లిప్‌స్టిక్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. ప‌లు రంగుల్లో ఇది ల‌భిస్తుంది. వీటి ధ‌ర‌లు మాత్రం బ్రాండ్ల‌ను బ‌ట్టి ఉంటాయి.

Viral News:ప్ర‌ధానంగా ప్ర‌పంచవ్యాప్తంగా ఎరువు రంగు లిప్‌స్టిక్‌కు ఎక్కువ మంది మ‌హిళ‌లు ఆస‌క్తి చూపుతుంటారు. దానిని వాడేవారి సంఖ్య ఎక్కువ‌గా ఉంటుంది. అయితే ఓ దేశంలో ఈ ఎరువు రంగు లిప్‌స్టిక్ వాడ‌కంపై ఏకంగా ఆదేశ ప్ర‌భుత్వం నిషేధ‌మే విధించింది. ఆ దేశంలోని మ‌హిళ‌లు కేవ‌లం త‌మ దేశంలో త‌యార‌య్యే లేత‌రంగు లిప్‌స్టిక్‌ల‌ను మాత్ర‌మే వాడ‌టానికి అనుమ‌తి ఉన్న‌ది. అక్క‌డ క‌నీసం ఎరువు రంగు లిప్‌స్టిక్‌ల‌ను ఎవ‌రూ అమ్మ‌ర‌న్న‌మాట‌.

Viral News:ప్ర‌పంచంలో వివాదాస్ప‌ద‌మైన నిర్ణ‌యాలు తీసుకునే దేశమైన ఉత్త‌ర కొరియాలోనే ఆ దేశ ప్ర‌భుత్వం ఈ ఎరువు రంగు లిప్‌స్టిక్‌పై నిషేధం విధించింది. ఎర్ర‌టి లిప్‌స్టిక్‌ను పాశ్చాత్య సంస్కృతి, పెట్టుబ‌డిదారీ విధానానికి చిహ్నంగా భావిస్తార‌ట‌. అందుకే ఈ దేశంలో ఎర్ర‌టి లిప్‌స్టిక్‌పై వాడ‌కం, అమ్మ‌కాల‌పై క‌ఠిన‌మైన ఆంక్ష‌లు ఉన్నాయి. ఆ దేశ మ‌హిళ‌లు కూడా ఈ ఎరువు రంగు లిప్‌స్టిక్‌పై ఆశ‌లే వ‌దులుకున్నారు. కేవ‌లం లేత‌రంగు వాటినే వాడుతుంటారు.

Viral News:ఎరువు రంగు లిప్‌స్టిక్ వాడ‌కంతో యువ‌త‌లో వ్య‌క్తివాదాన్ని పెంచుతుంద‌ని ఆ దేశ అధ్య‌క్షుడు కిమ్‌జోంగ్ ఉన్ ఈ వింత ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్నాడ‌ని అంటున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల దేశ సంక్షోభాన్ని ఎదుర్కోవ‌చ్చ‌ని కూడా కిమ్ జోంగ్ ఉన్ విశ్వ‌సిస్తున్నార‌ట‌. అందుకే అక్క‌డ ఎరువు రంగు లిప్‌స్టిక్ వినియోగించే వారిపై క‌ఠిన ఆంక్ష‌ల‌ను విధిస్తుంటారు. వ్య‌క్తిగ‌త ఆక‌ర్ష‌ణ‌, గ్లామ‌ర్‌, పాశ్చాత్య ప్ర‌భావానికి త‌మ దేశ మ‌హిళ‌లు లోనుకావ‌ద్ద‌నే ఈ నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్టు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *