Viral News:

Viral News: 150 ఏండ్ల‌ క్రిత‌మే లిఫ్ట్‌ల‌ను వాడిన నిజాం న‌వాబులు

Viral News: ఇది నిజ‌మే. ఆనాడు అంత సాంకేతిక‌త ఉన్న‌దా? అదెలా సాధ్యం? అనిపించ‌వ‌చ్చు. కానీ, ఆనాడు అందుబాటులో ఉన్న‌ సామ‌గ్రి, ప‌రిక‌రాల‌తో లిఫ్ట్‌ల‌ను వాడిన ఆన‌వాళ్లు మ‌న‌కు తాజాగా బ‌య‌ట‌ప‌డింది. ఆరో నిజాం ప్ర‌భువైన మీర్ మెహ‌బూబ్ అలీఖాన్ ఈ లిఫ్ట్‌ల‌ను వినియోగించార‌ని తేలింది. ఆ త‌ర్వాత నిజాం ప్ర‌భువుల్లో చివ‌రివాడైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ కూడా ఈ లిఫ్ట్‌ను వాడిన‌ట్టు ఆధారాలు ఉన్నాయి.

Viral News: సుమారు 150 సంవ‌త్స‌రాల క్రితం నుంచే నిజాం న‌వాబులు ఈ లిఫ్ట్‌ల‌ను వాడార‌ని తెలిసింది. బ‌ల‌మైన తాళ్లు, చ‌క్రాల‌తో రూపొందించిన లిఫ్ట్‌ను మ‌నుషులే ఆప‌రేట్ చేసేవార‌ట‌. లండ‌న్ న‌గ‌రానికి చెందిన ఆర్‌వే గుడ్ కంపెనీ ఈ లిఫ్ట్‌ను త‌యారు చేసింది. 8 మంది సామ‌ర్థ్యంతో ఈ లిఫ్ట్‌లో పైఅంత‌స్తుకు వెళ్ల‌వ‌చ్చు. చెక్క‌తో త‌యారు చేసిన ఈ లిఫ్ట్ ఇప్ప‌టికీ ప‌నిచేసే స్థితిలో ఉండ‌టం విశేషం. దీన్ని సంద‌ర్శ‌కుల కోసం పురానా హ‌వేలీలోని నిజాం మ్యూజియంలో సంద‌ర్శ‌న‌కు ఉంచారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *