Viral News:

Viral News: మేక‌పై వికృత చ‌ర్య.. అడ్డుకున్న య‌జ‌మానిపైనే దుండగుడి దాడి

Viral News: కామంతో క‌ళ్లు మూసుకుపోయాయి అన‌డానికి ఈ యువ‌కుడి వికృత చ‌ర్య‌లే నిద‌ర్శ‌నం. ఇలాంటి వారికి వావి వ‌రుస‌లు, ఉచ్ఛం, నీచం, సిగ్గు, ల‌జ్జ అనేవి ఉండ‌వు. వీడి వికృత చ‌ర్య‌లు అలాంటివి ఇలాంటివి కాదు. త‌న పైత్యాన్ని ఓ మేక‌పై ప్ర‌ద‌ర్శించ‌బోయాడు. ఇది ప్ర‌కృతికి విరుద్ధ‌మైన ఇలాంటి చ‌ర్య‌ల‌ను ఆ మేక య‌జ‌మాని అడ్డుకోబోయాడు. దీంతో ఆ దుండ‌గుడు ఏకంగా ఆ మేక యజ‌మానిపైనే దాడికి దిగాడు.

Viral News: ప‌శ్చిమ బెంగాల్‌లోని మాల్డాలో పొలంలో మేస్తున్న మేక‌పై స్థానికుడు అయిన ఓ యువ‌కుడి క‌న్నుప‌డింది. అనుకున్న‌దే త‌డ‌వుగా ఆ మేక‌ను ఎత్తుకెళ్లాడు. త‌న మేక క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆ య‌జ‌మాని వెతుకుతూ వెళ్లాడు. ఓ చోట మేక అరుపులు వినిపించాయి. అటుగా వెళ్లి చూసి అవాక్క‌వ‌డం ఆయ‌న వంతైంది.

Viral News: ఆ మేకను ఎత్తుకెళ్లిన యువ‌కుడు ఏకంగా ఆ మేక‌పైనే లైంగిక‌దాడికి పాల్ప‌డుతూ క‌న‌పించాడు. ఆ స‌మ‌యంలో వెళ్లి ఆ మేక య‌జ‌మాని అడ్డుకోబోయాడు. దాంతో వెంట‌నే ఆ యువ‌కుడు య‌జ‌మానిపై దాడికి దిగాడు. ఆ త‌ర్వాత ఇదే విష‌యాన్ని ఆ య‌జ‌మాని ఊళ్లో ప‌లువురికి చెప్పాడు. ఈ విష‌యం ఆనోటా, ఈనోటా ఊరంతా తెలిసిపోయింది.

Viral News: మేక‌పై అత్యాచారం చేసిన విష‌యం అంద‌రికీ తెలిసింద‌ని తెలుసుకున్న ఆ యువ‌కుడు కుంగిపోలేదు. సిగ్గుపోయింద‌ని త‌ల‌దించుకోలేదు. కుమిలిపోలేదు, కుంగిపోలేదు. తాను త‌ప్పు చేశాన‌ని తెలుసుకోనూ లేదు. ప్ర‌కృ తి విరుద్ధం అని అంగీక‌రించ‌నూ లేదు. ఊళ్లో వాళ్లంద‌రికీ తెలిసింద‌ని ర‌గిలిపోయాడు. ఎలా చెప్తాడు అంటూ ఆగ్ర‌హోద‌గ్రుడ‌య్యాడు.

Viral News: త‌న గురించి గ్రామంలో చెప్తావా అంటూ ఆ మేక య‌జ‌మాని ఇంటిపైనే ఆ యువ‌కుడు ఫుల్లుగా మ‌ద్యం తాగి దాడికి దిగాడు. అడ్డొచ్చిన కుటుంబ స‌భ్యుల‌పైనా దాడికి దిగాడు. త‌ను చేసిన ఘ‌న కార్యాన్ని స‌మ‌ర్థించుకున్నాడు. దీనిపై బాధిత కుటుంబం పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. మేక‌పై జ‌రిగిన అకృత్యం గురించి తెలిసిన గ్రామ‌స్థులు గొల్లున న‌వ్వుకున్నారు. ఇదేమి పోయే రోగం అంటూ తిట్టుకున్నారు. కామంతో క‌ళ్లు మూసుకుపోయాయి అంటూ దుమ్మెత్తిపోశారు. ఇంకా ఎవ‌రికి తోచిన రీతిలో వారు ఆ ఘ‌ట‌న‌పై చ‌ర్చించుకోవ‌డం జ‌రిగింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  amaravati: ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత జగన్ అలియాస్ పండన్న హతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *