Viral News: రొమేనియా దేశంలోని అది ఓ పల్లెటూరు. ఓ బాలిక తన చిన్ననాడు గొర్రెలు మేపేందుకు అడవికి వెళ్లిన సమయంలో అక్కడి ఓ ఏటిలో దొరికిన రంగు రాయిని ఇంటికి తీసుకొచ్చింది. తలుపు గాలికి కొట్టుకోకుండా ఉండేందుకు ఆ రాయిని అడ్డుగా పెట్టింది. ఆ బాలికే పెద్దదై, పెళ్లయి పిల్లలై పెద్ద కుటుంబమే అయింది. అయినా అలా 60 ఏళ్లు ఆ రాయిని ఆ తలుపునకు అడ్డుగా పెడుతూనే ఉంటూ వచ్చింది. అయితే ఇటీవలే ఆ మహిళ తనువు చాలించింది. అప్పడు ఆ రాయి తన విలువను చూపించింది.
Viral News: ఆ మహిళ చనిపోయిన కారణంగా వారింటికి వచ్చిన ఓ బంధువు ఆ రంగురాయిని చూశాడు. అనుమానంతో ఆ రాయిలో ఏదో మహత్యం ఉన్నదని గ్రహించాడు. దానిని పరీక్ష జరిపిస్తే ఏదో విలువైనదై ఉంటుందని భావించాడు. తాను అనుకున్నది ఆ మహిళ కుటుంబ సభ్యులకు హింట్స్ ఇచ్చాడు. వెంటనే దానిని ఓ ఆ కుటుంబంతో కలిసి ప్రయోగశాలకు తీసుకెళ్లి పరీక్షలు జరిపించారు. ఆ సమయంలో ఆ కుటుంబానికి కండు చెదిరే సమాచారం తెలిసింది.
Viral News: ఆ తలుపునకు అడ్డుగా పెట్టిన ఆ రాయి అత్యంత అరుదైన రత్నమని ఆ ప్రయోగశాలలో తేలింది. అది సుమారు 70 లక్షల సంవత్సరాల నాటిదని నిర్ధారించారు. ఈ విషయం అక్కడి ప్రభుత్వానికి తెలిసింది. దీంతో అంతటి అరుదైన ఆ రత్నాన్ని ప్రభుత్వమే సొంతం చేసుకోవాలని భావించింది. ఆ మహిళ కుటుంబ సభ్యులకు రూ.11 కోట్ల నగదును బహుమానంగా ఇచ్చి ప్రభుత్వం ఆ విలువైన రత్నాన్ని రొమేనియా దేశంలోని భుజో మ్యూజియంలో సందర్శకుల కోసం ప్రదర్శనకు ఉంచింది.
Viral News: ఆ విలువైన రత్నం భుజో మ్యూజియంలో భద్రతా వలయం మధ్యన ఉన్నది. ఆ మహిళ ఇంటికి 70 ఏండ్లు తలుపు చప్పుడు రాకుండా ఉండేందుకు కాపలా కాసిన ఆ రాయికి ఇప్పుడు భద్రతా సిబ్బంది కావలి కాస్తున్నారు. జాతి రత్నమైనా అది తెలియని వ్యక్తి చేతిలో ఉండటంతో అది మామూలు రాయిగానే మిగిలిపోయింది. దాని విలువ తెలిసిన తర్వాల దానిని కాపాడటం కష్టంగా మారడం విశేషం.
