Viral News: మందుబాబులం మేము మందుబాబులం.. అని చెప్పకనే చెప్పేశారు నల్లగొండ జిల్లా మద్యం ప్రియులు. డిసెంబర్ 1 నుంచి మద్యం పాలసీ మొదలైంది. అదేరోజు నుంచి మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి 22వ తేదీ వరకు అత్యధిక అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ నెల మొత్తం మద్యం అమ్మకాల లక్ష్యం.. కేవలం 17 రోజుల్లో పూర్తవడం విశేషం. వీటిలో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే నల్లగొండ జిల్లాలో అత్యధిక అమ్మకాలు జరిగినట్టు తేలింది.
Viral News: పంచాయతీ ఎన్నికలు రావడం మద్యం వ్యాపారులకు పండుగలా కలిసొచ్చింది. దీంతో అత్యధిక అమ్మకాలు జరిగినట్టు అంచనా. ఈ 22 రోజుల్లోనే ఒక్క నల్లగొండ జిల్లాలోనే 427.03 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. చలిలోనూ బీర్ల అమ్మకాల జోరు పెరిగింది. ఇదే నెలలో గతేడాది కేవలం రూ.211.57 కోట్ల అమ్మకాలు జరిగాయి. దీన్నిబట్టి 102 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయి. దీంతో ఆబ్కారీ శాఖకు ఆదాయం మరింతగా పెరిగింది.
Viral News: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రోజుకు సగటున రూ.18 కోట్ల చొప్పున సరాసరి అమ్మకాలు జరిగినట్టు అంచనా. డిసెంబర్ 1 నుంచి 17వ తేదీ వరకే 373.81 కోట్ల అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. గతేడాది ఇదే 17 రోజుల్లో రూ.152.13 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాది డిసెంబర్ నెల మొత్తం కలిసి రూ.366 కోట్ల మద్యం అమ్మకాలయ్యాయి. కానీ, ఈ 17 రోజుల్లో ఆ అమ్మకాలను దాటేయడం విశేషం.
Viral News: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 329 మద్యం దుకాణాలు ఉండగా, డిసెంబర్ 1 నుంచి 15 వరకు 3,40,615 పెట్టెల లిక్కర్ బాటిళ్లు అమ్ముడవగా, 3,47,800 బీర్ల పెట్టెలు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే 15 రోజుల్లో లిక్కర్ 1,52,615 పెట్టెలు, బీర్లు 2,04,512 పెట్టెలు అమ్ముడయ్యాయి.
