Viral News: విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలు తీవ్ర అస్వస్థతకు గురికాగా ప్రాణాపాయం నుంచి కాపాడారు డాక్టర్ అయిన మాజీ ఎమ్మెల్యే. గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం గాలిలో ఉండగానే ఒక ప్రయాణికురాలు ఛాతీ నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అదే విమానంలో ప్రయాణంలో ఉన్న కాన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అంజలి నింబాల్కర్ వెంటనే చొరవ తీసుకున్నారు.
Viral News: డాక్టర్ అంజలి నింబాల్కర్ బాధితురాలికి సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడారు. డాక్టర్ అంజలి నింబాల్కర్ చొరవపై ప్రయాణికులు అభినందనలు తెలిపారు. ఆమె వల్ల ఓప్రయాణికురాలి ప్రాణం దక్కిందని ఊపిరి పీల్చుకున్నారు. ఆమె చర్యపై సోషల్ మీడియాలో పలు పోస్టులు వెల్లువెత్తాయి. నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.
