Viral News:

Viral News: కూతురి పెళ్లి.. అంత్య‌క్రియ‌లు చేసిన తండ్రి

Viral News: ప‌రువు, ప్ర‌తిష్ఠ‌లకు పోయి కొంద‌రు ఎంత‌కైనా తెగిస్తున్నారు. ముఖ్యంగా ప్రేమ వివాహాలపై ఇవి ప‌డ‌గ‌విప్పి కాటేస్తున్నాయి. ఎంద‌రివో ప్రాణాలు గాలిలో క‌లిశాయి. కానీ, ఇక్క‌డ కూడా ప‌రువు, ప్ర‌తిష్ఠ‌ల‌కు పోయిన ఓ కుటుంబం ఏకంగా ప్రేమ వివాహం చేసుకున్న యువ‌తికి బతికుండగానే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించిన ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది.

Viral News: మ‌ధ్యప్ర‌దేశ్ రాష్ట్రంలోని విదిశాలో 23 ఏళ్ల స‌విత అదృశ్య‌మైంది. ఈ మేర‌కు ఆ యువ‌తి త‌ల్లిదండ్రులు త‌మ కూతురు క‌నిపించ‌డం లేద‌ని పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. విచార‌ణ‌లో ఆమె ఓ యువ‌కుడిని వివాహం చేసుకొని వేరుగా జీవిస్తున్న‌ట్టు తేలింది. దీంతో ఆ కుటుంబం త‌ల్ల‌డిల్లిపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న త‌న కూతురే త‌మ‌ను విడిచి వెళ్లిందా అని రోదించారు.

Viral News: ఇదే స‌మ‌యంలో త‌న కూతురు ప్రేమ వివాహం చేసుకున్న విష‌యాన్ని ఆ యువ‌తి తండ్రి జీర్ణించుకోలేక‌పోయాడు. త‌న కూతురు చ‌నిపోయింద‌ని అంద‌రికీ చెప్పుకోసాగాడు. త‌న కూతురి ఫొటోతో అదే ఊరిలో పాడెక‌ట్టి త‌న బంధుమిత్రుల‌తో క‌లిసి ఊరేగింపు చేయించాడు. శాస్త్రోక్తంగా ఆమెకు పిండ‌ప్ర‌దానం కూడా చేసి అంత్య‌క్రియ‌ల తంతు నిర్వ‌హించాడు. బ‌తికుండ‌గానే ఆ యువ‌తికి ఆమె తండ్రి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌డంపై బంధుమిత్రులు, గ్రామ‌స్తులు విస్తుపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *