Devil’s Astrologer

Devil’s Astrologer: నేపాల్ రాజకీయ పరిణామాలను 2 ఏళ్ల క్రితమే ఊహించిన జ్యోతిష్కుడు.. ఏమి చెప్పాడంటే

Devil’s Astrologer: నేపాల్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడంపై యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. నిరసనలు హింసాత్మకంగా మారడంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఈ పరిణామాల ఫలితంగా ప్రధాని కె.పి. ఓలి సహా పలువురు కీలక మంత్రులు రాజీనామా చేసి అదృశ్యమయ్యారు. తాజా సమాచారం ప్రకారం, కొత్త ప్రధానిగా కుల్మన్ ఘీసింగ్‌ను నియమించినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

అయితే, ఇదే సమయంలో నేపాల్‌లో ప్రజాస్వామ్యం అంతం అవుతుందన్న వార్తలు గాలం వేస్తున్నాయి. ముఖ్యంగా జ్యోతిష్కుడు ప్రశాంత్ కినీ చేసిన పాత అంచనాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయన 2023 డిసెంబర్ 16న చేసిన ఒక పోస్ట్‌లో “2025లో నేపాల్‌లో రాచరికం తిరిగి వస్తుంది” అని చెప్పాడు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఆయన అంచనా నిజమవుతున్నట్లు కనిపిస్తోంది.

Devil’s Astrologer

ప్రశాంత్ కినీ అంచనాలు మళ్లీ హాట్ టాపిక్

ప్రశాంత్ కినీ తన X బయోలో రాజకీయాలను అంచనా వేసే జ్యోతిష్కుడిగా, టారో రీడర్‌గా, భవిష్యత్తు చెప్పగల వ్యక్తిగా పేర్కొన్నాడు. మార్చి 2023లో Xలో చేరిన ఆయన, గతంలో ఖతార్ భవిష్యత్తు గురించీ, ఉగ్రదాడులు, ఆర్థిక మాంద్యం వంటి అంశాలపై కూడా అంచనాలు చేశారు. సెప్టెంబర్ 9న ఆయన ఖతార్ గురించి పాత అంచనాను మళ్లీ రీ పోస్ట్ చేస్తూ, ఇజ్రాయెల్ దాడిపై స్పందించారు. దీంతో ఆయన విశ్లేషణలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి.

యువ నాయకుడు అవిష్కర్ రౌత్ – “జై నేపాల్” ప్రసంగం నుంచి ఉద్యమానికి

ఈ రాజకీయ అలజడికి ప్రధాన ప్రేరణ అవిష్కర్ రౌత్ అనే యువకుడే. ఆయన కొన్ని నెలల క్రితం ఒక స్కూల్ కార్యక్రమంలో అవినీతి వ్యతిరేకంగా ఉగ్ర ప్రసంగం చేసి ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాడు. అతని “జై నేపాల్” ప్రసంగం దేశమంతటా గర్జించింది. ఆరు నెలల వ్యవధిలోనే రౌత్ జనరల్ జెడ్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ, ఖాట్మండులో నిరసనలకు ముందుండి నినాదాలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Old City: పాతబస్తీలో అధికారుల నిర్లక్ష్యం.. మ్యాన్‌హోల్‌లో పడిపోయిన చిన్నారి..!

నిరసనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తారంగా వైరల్ అవుతున్నాయి. రౌత్ వెనుక పెద్ద సంఖ్యలో యువ విద్యార్థులు, సాధారణ ప్రజలు నిలబడి నినాదాలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ నిరసనల వల్లనే దేశ రాజకీయ నిర్మాణం కుదేలైపోయింది. అనేక ప్రాణ నష్టాలు చోటు చేసుకున్నాయి.

రాజకీయ భవిష్యత్తు ఏ దిశగా?

ALSO READ  Piyush Goyal: పీయూష్ గోయల్ తో భేటీ అయిన ఎగుమతిదారులు.

నేపాల్‌లో ప్రస్తుతం ప్రజాస్వామ్యం ముగిసిపోతోందా? రాచరికం తిరిగి వస్తుందా? అన్న ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకవైపు యువత తిరుగుబాటు, మరోవైపు జ్యోతిష్కుల అంచనాలు – ఈ రెండు కలిసిపోవడంతో నేపాల్ రాజకీయ భవిష్యత్తు అనిశ్చితంగా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *