Viral News: తమిళనాడులోని కోయంబత్తూరులో 8వ తరగతి చదువుతున్న దళిత బాలికను పరీక్ష రాయడానికి ఒంటరిగా కూర్చోబెట్టిన కేసు వెలుగులోకి వచ్చింది. ఆ అమ్మాయికి పీరియడ్స్ వచ్చాయని చెబుతున్నారు. అందుకే ఒంటరిగా బయట కూచోపెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. ఆ అమ్మాయి కోయంబత్తూరులోని సెంగుట్టాయిపాలయంలోని స్వామి చిద్భవానంద మెట్రిక్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుతుంది.
ఈ సంఘటనకు సంబంధించిన 1.22 నిమిషాల వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఆ అమ్మాయి మెట్లపై కూర్చుని పరీక్ష రాస్తూ కనిపిస్తుంది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత, దర్యాప్తుకు ఆదేశించారు. ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. రిపోర్ట్స్ ప్రకారం, పరీక్ష సమయంలో ఏప్రిల్ 5న బాలికకు పీరియడ్స్ ప్రారంభమయ్యాయి. దీని తరువాత ప్రధానోపాధ్యాయురాలు ఆమెను తరగతి బయట కూర్చుని పరీక్ష రాయమని చెప్పింది.
Viral News: వైరల్ అవుతున్న వీడియోలో ఆ అమ్మాయి ఒక స్త్రీతో మాట్లాడటం వినబడింది. ఆ మహిళ ఆ అమ్మాయి తల్లి అని భావిస్తున్నారు. వీడియోలో, ఆ అమ్మాయి ఇలా చెప్పింది: “ప్రిన్సిపాల్ నన్ను ఇక్కడ మెట్లపై కూర్చుని పరీక్ష రాయమని చెప్పారు.” ఆ అమ్మాయి ఇలా బయట కూర్చుని పరీక్ష రాయడం కూడా మొదటిసారి జరగలేదని చెప్పింది. ప్రిన్సిపాల్ నన్ను పరీక్ష కోసం వేరే ప్రదేశానికి తీసుకెళ్లింది అని బాలిక చెప్పడం కనిపించింది.
Also Read: China tariffs: చౌకగా చైనా ఎలక్ట్రానిక్ వస్తువులు..
అయితే, స్కూల్ యాజమాన్యం వాదన వేరేలా ఉంది. ఇక్కడ, పరీక్ష సమయంలో బాలిక తల్లి ఆమెను బయట కూర్చోబెట్టమని కోరిందని పాఠశాల యాజమాన్యం ఆరోపిస్తోంది. అయితే, ఆ అమ్మాయిని విడిగా కూర్చోబెట్టి పరీక్ష రాయించాలని మాత్రమే తానూ కోరుకుంటున్నానని తల్లి చెప్పింది.
Viral News: ఆ పాఠశాలపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ తెలిపారు. ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. పిల్లలను అణచివేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని ఆయన చెప్పారు. పిల్లలపై ఎలాంటి ఒత్తిడినైనా తాము ఏమాత్రం సహించమని చెప్పారు.
ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎం పలమిసామిపై విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. విచారణ రిపోర్ట్ ఆధారంగా ఏదైనా తప్పు జరిగినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

