Vinayaka Chavithi:వినాయకుడిని గణేషుడు, గణపతి, పిళ్లైయార్ అని కూడా పిలుచుకుంటారు. హిందూ దేవతలలో అత్యంత ప్రసిద్ధి చెందిన, అత్యంత గౌరవనీయమైన సర్వోన్నత దేవుడు వినాయకుడు. గణేషుడిని హిందువులే కాకుండా జైనులు, బౌద్ధులు కూడా పూజిస్తారు. అలాంటి వినాయకుడు భారతదేశం వెలుపల కూడా ఆరాధిస్తారు. అలా థాయ్‌లాండోలో కూడా భారీగా వినాయకుడిని పూజిస్తారు.
Vinayaka Chavithi:ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన వినాయకుడి విగ్రహం కూడా థాయ్‌లాండ్‌లోని చాచో యెంగ్సావ్ ప్రావిన్స్‌లో ఉన్నది. ఈ విగ్రహం 128 అడుగుల ఎత్తు అంటే సుమారు 14 అంతస్థుల భవనమంత ఎత్తు ఉన్నది. ఈ విగ్రహాన్ని 2008-2012లోనే నిర్మించడం గమనార్హం. ఈ భారీ విగ్రహం భక్తులు, పర్యాటకులకు ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తున్నది.
Vinayaka Chavithi:నాలుగు చేతుల్లో పండ్లు ధరించి, సమృద్ధి, ఆనందం, పోషణ, జ్ఞానానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. చాచో యెంగ్సావ్ సిటీని గణేశ్ నగరం అని కూడా పిలుచుకుంటారు. దీనిని బట్టి హిందూ మతంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉండే వేరే మతస్థులు కూడా వినాయకుడిని తమ ఆరాధ్య దైవంగా భావిస్తారని దీనిని బట్టి అర్థమవుతుంది.