Ghaati: జనవరి 15 తమిళ నటుడు విక్రమ్ ప్రభు పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతను కీలక పాత్ర పోషిస్తున్న ‘ఘాటి’ మూవీ నుండి గ్లింప్స్ ను విడుదల చేసింది చిత్ర బృందం. అనుష్కశెట్టి నాయికగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమాను రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని ఐదు భాషల్లో ఏప్రిల్ 18న విడుదల చేయబోతున్నారు. అనుష్క లానే ఇందులో విక్రమ్ ప్రభుది కూడా చాలా కీలకమైన పాత్ర అని ఈ గ్లింప్స్ చూస్తుంటే అర్థమౌతోంది. క్రిష్ జాగర్లమూడి తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ‘ఘాటి’ని తెరకెక్కిస్తున్నారు.
