Parigi: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో కళాశాల విద్యార్థులు నిరసన ర్యాలీ, ఆర్టీసీ బస్టాండ్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు.స్కాలర్షిప్లు ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదని అది విద్యార్థుల హక్కు అని అన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.బీజాపూర్ – హైదరాబాద్ హైవేపై బైఠాయించి నిరసన తెలుపడంతో రోడ్డు ఇరువైపులా కిలోమీటర్ల మేర స్తంభించిన వాహనాలు స్థంభించడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పోలీసుల రంగ ప్రవేశం చేసి విద్యార్థులకు నచ్చచెప్పి ధర్నాను విరమింపజేశారు. స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించకపోతే వికారాబాద్ కలెక్టరేట్ ని హైదరాబాద్ లో సెక్రటేరియట్ని ముట్టడిస్తామని హెచ్చరించారు విద్యార్థి సంఘాల నాయకులు.ఈ కార్యక్రమంలో భారీఎత్తున విద్యార్థులు పాల్గొని అమరవీరుల చౌరస్తా నుంచి ర్యాలిగా వచ్చి ధర్నా నిర్వహించారు.

